SBI Branch Transfer: ఎస్‌బీఐ ఖాతా, బ్రాంచ్‌ను మార్చుకోవాలనుకుంటున్నారా.? బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే..
SBI Branch Transfer: ప్రస్తుతం ఉన్న మీ బ్యాంకు ఖాతా బ్రాంచ్‌ను మరో బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి సహజంగా సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి...
SBI Branch Transfer: ప్రస్తుతం ఉన్న మీ బ్యాంకు ఖాతా బ్రాంచ్‌ను మరో బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి సహజంగా సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, బ్యాంకు అధికారులకు అందించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా లేకుండా ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్‌లో బ్రాంచ్ మార్చుకునే అవకాశాన్ని కలిపించింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ. యోనో యాప్, ఎస్‌బీఐ ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇందుకోసం ఎస్‌బీఐ ఖాతాదారులు ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.
యోనో యాప్ ద్వారా ఇలా చేసుకోండి..
* మొదట ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. * అనంతరం ‘సర్వీసెస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * ఆ తర్వాత మీ సేవింగ్స్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకొని. మీరు ఏ బ్రాంచ్‌కి అకౌంట్‌ను మార్చుకోవాలనుకుంటున్నారో. ఆ బ్యాంక్ బ్రాంచ్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. * అనంతరం ‘గెట్ బ్రాంచ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే బ్రాంచ్‌ల పేర్లు కనిపిస్తాయి. * చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా ఇలా మార్చుకోండి..
* మొదటగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం పర్సనల్ బ్యాంకింగ్ ట్యాబ్ సెలక్ట్ చేసుకొని ‘ఈ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. * బ్రాంచ్ మార్చుకోవాలనుకుంటున్న మీ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకొని.. మీరు కోరుకున్న బ్రాంచ్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. * బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయగానే బ్రాంచ్ పేరు వస్తుంది. దానిని ఎంచుకొని సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. * పూర్తి వివరాలను సరిచూసుకున్న తర్వాత కన్ఫామ్ బటన్‌పై నొక్కితే ఓటీపీ వస్తుంది. * ఓటీపీ ఎంటర్ చేసి చివరిగా కన్ఫామ్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
‘మూడు నెలల్లోగా కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవచ్చు.’ యూఎస్ ఇంటెలిజెన్సీ వర్గాలు
Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్ పాఠాలు ఏంటో చూడండి.