‘మూడు నెలల్లోగా కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవచ్చు.’ యూఎస్ ఇంటెలిజెన్సీ వర్గాలు

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబన్లు బహుశా నెల రోజుల్లోగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోగా పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చునని తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్టు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

'మూడు నెలల్లోగా కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవచ్చు.' యూఎస్ ఇంటెలిజెన్సీ వర్గాలు
Talibans
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 11, 2021 | 8:06 PM

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబన్లు బహుశా నెల రోజుల్లోగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోగా పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చునని తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్టు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్గనిస్తాన్ లో 65 శాతం ప్రాంతాలను వారు ఇప్పటికే తమ హస్తగతం చేసుకున్నారని.. మరిన్ని పట్టణాలు, జిల్లాలను తమ వశం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ వారం రోజుల్లో దాదాపు 11 ప్రొవిన్షియల్ రాజధానులను వారు చేజిక్కించుకున్నారని ఆయన అన్నారు. కాబూల్ ఇక ఎంతకాలం ఆఫ్ఘన్ దళాల రక్షణలో ఉంటుందో చెప్పలేమన్నారు. ఇది ఆ సైనికుల పోరు, వారి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. అయితే చివరి క్షణంలో ఆఫ్ఘన్ దళాలు తాలిబన్లను గట్టిగా ప్రతిఘటించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘన్ ఉత్తర ప్రాంతంలో బదక్ షాన్ రాజధాని ఫైజాబాద్ ను వీరు బుధవారం తమ హస్తగతం చేసుకోవడం అష్రాఫ్ ఘని ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అని ఆయన చెప్పారు.

బదక్ షాన్ .పాకిస్తాన్, తజికిస్తాన్, చైనా దేశాల సరిహద్దుల్లో ఉంది. ఆఫ్ఘన్ దళాలతో జరిపిన తీవ్రమైన పోరు అనంతరం ఫైజాబాద్ ను తాలిబన్లు స్స్వాధీనం చేసుకోగలిగారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అధ్యక్షుడు అష్రాఫ్ గని హుటాహుటిన ప్రత్యేక విమానంలో మజారే షరీఫ్ చేరుకొని స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. ఇక్కడ తమ దేశ సైనికుల్లో ధైర్యం నింపేందుకు ఆయన మజారే షరీఫ్ నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దేశాన్ని ఇక ఆ దేశ సైనికులే రక్షించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో అష్రాఫ్ ఘని తమ దేశ రక్షణపై మరింత దృష్టి పెట్టారు. .

మరిన్ని ఇక్కడ చూడండి: రెండు రోజుల ముందే ముగిసిన లోక్ సభ సమావేశాలు..స్పీకర్ చాంబర్ లో సమావేశమైన ప్రముఖులు

Kamma Community: ‘కమ్మ సామాజిక వర్గంలో పేద, మధ్య తరగతి వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తా’

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు