Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్‌ పాఠాలు ఏంటో చూడండి.

Samantha: ఫిట్‌నెస్‌కు ఇటీవల ప్రాధాన్యత బాగా పెరిగిపోతోంది. ఆరోగ్యంపై అందరిలోనూ ఆసక్తి ఎక్కువవుతోంది. మరీ ముఖ్యంగా గ్లామర్‌ రంగంలో ఉండే నటీమణులు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్‌ పాఠాలు ఏంటో చూడండి.
Samantha Instagram
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2021 | 7:53 PM

Samantha: ఫిట్‌నెస్‌కు ఇటీవల ప్రాధాన్యత బాగా పెరిగిపోతోంది. ఆరోగ్యంపై అందరిలోనూ ఆసక్తి ఎక్కువవుతోంది. మరీ ముఖ్యంగా గ్లామర్‌ రంగంలో ఉండే నటీమణులు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గంటల తరబడి జిమ్‌లలో వర్కవుట్స్‌ చేస్తూ ఆరోగ్యంతో పాటు శరీర రూపాన్ని కాపాడుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు అందాల తార సమంత. వివాహం తర్వాత కూడా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతున్న సమంత ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్నా ఆమె అందం చెక్కు చెదరకపోవడానికి బహుశా ఇదే కారణం అయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ సమయంలో హోమ్‌ గార్డెనింగ్‌ ప్రారంభించిన సమంత.. ఇంట్లోనే ఆర్గానిక్‌ పంటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా ఫిట్‌నెస్‌ను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయట్లేదు సమంత. ఇందులో భాగంగానే తన ఫిట్‌నెస్‌ జర్నీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా సింగిల్‌ హ్యాండ్‌తో చేసిన ఓ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేసిన సమంత.. ‘ఫిట్‌నెస్‌ కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మంచి న్యూట్రిషియన్‌ ఆహారం మిమ్మల్ని బలంగా ఆరోగ్యవంతులుగా మార్చుతుంది. ఫిట్‌నెస్‌ అనేది ఒక డెస్టినేషన్‌ కాదు.. మిమ్మల్ని అద్భుతంగా మార్చే ఓ అద్భుత ప్రయాణం. మీరు ఇష్టపడేవారితో ఎక్కువ సమయం గడపండి. ఎప్పుడూ మీకు సంతోషం కలిగించే పనులు చేయండి. మీ ఫిట్‌నెస్‌ జర్నీలను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు సమంత. సమంత ఫిట్‌నెస్‌, అందానికి కారణం ఏంటో తెలుసుకున్నారు కదా.. మరెందుకు మీరు కూడా ఎంచక్కా సామ్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

Also Read: Devil fish: తెలుగు రాష్ట్రాల్లో ‘దెయ్యం చేప’ టెర్రర్.. లబోదిబోమంటున్న మత్సకారులు, చేపల పెంపకందారులు

Harassment: మొదట స్నేహం అన్నాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నాని వేధించాడు. నో చెప్పేసరికి అసలు రూపం బయట పెట్టాడు.

Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మ్యాటరెంటంటే..