AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: షూటింగ్‌ స్పాట్‌లో ఏడ్చేసిన సోనూసూద్‌… బ్లాక్‌ బ్లస్టర్‌ రావాలంటే ఇది తప్పదంటూ పోస్ట్‌..

Sonu Sood: సోనూసూద్‌ పేరును ప్రస్తుతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ ఎంతో మందకి చేయందించి ప్రజలకు దేవుడిగా మారారు సోనూ. అడిగినవారికి...

Sonu Sood: షూటింగ్‌ స్పాట్‌లో ఏడ్చేసిన సోనూసూద్‌... బ్లాక్‌ బ్లస్టర్‌ రావాలంటే ఇది తప్పదంటూ పోస్ట్‌..
Sonusood
Narender Vaitla
|

Updated on: Aug 11, 2021 | 8:50 PM

Share

Sonu Sood: సోనూసూద్‌ పేరును ప్రస్తుతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ ఎంతో మందకి చేయందించి ప్రజలకు దేవుడిగా మారారు సోనూ. అడిగినవారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి దృష్టిలో హీరోగా మారాడు. స్క్రీన్‌పై విలన్‌ పాత్రలో కనిపించినా రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా పేరు సంపాదించుకున్నారు. దీంతో సోనూసూద్‌కు సంబంధించిన ప్రతీ చిన్న వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాను సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అదొక ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్‌ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. కారణం సోనూసూద్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో ఆయన ఏడుస్తుండడమే.

అదేంటి ఎంతో మంది కంటి నీరును తూడిచిన సోనూ కంట కన్నీరు రావడమేంటని ఆలోచిస్తున్నారా? అదేం లేదులేండి.. ఫన్‌ కోసం సోనూ చేసిన పనే ఇది. సోనూసూద్‌ తాజాగా ‘సాత్‌ క్యా నిభావోగే’ పాటలో కనిపించారు. ఈ పాటకు ప్రముఖ డైరెక్టర్‌ ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. ఈ పాటను తొంభైలలో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్న ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ పాటకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ నెల 9న విడుదల చేసిన ఈ పాటలో సోనూ సరసన నిధి అగర్వాల్‌ చిందులేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సోనూ. ఇందులో ఆయన నిధి కుర్చున్న కెమెరా ట్రాలీని లాగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఫన్నీగా ఏడుస్తున్నట్లు యాక్ట్‌ చేస్తూ.. ‘ఓ బ్లాక్‌ బ్లస్టర్‌ సాంగ్‌ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

Also Read: Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్‌ పాఠాలు ఏంటో చూడండి.

Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

Allu Shirish: బుల్లితెరపైకి అల్లువారబ్బాయి.. మిల్కీబ్యూటీతో కలిసి సందడి చేయనున్న హీరో..