Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం అందిస్తున్నాడు.

Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..
Pushpa
Follow us

|

Updated on: Aug 11, 2021 | 7:29 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో పూర్తిగా డీ గ్లామర్ లుక్‏లో కనిపించబోతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, పుష్పరాజ్ ఇంట్రడ్యూస్ వీడియో అంటూ మొదటి నుంచి ఈ సినిమా పై హైప్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న మేకర్స్… ఇటీవల ఈ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యూజిక్ డైరెక్ట్రర్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను ఐదు భాషలలో ఐదుగురు ఫేమస్ సింగర్స్ పాడారు. ఇప్పటికే తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన ప్రోమోలను ఒక్కోక్కటిగా విడుదల చేసిన చిత్రయూనిట్..తాజాగా తెలుగు వెర్షన్ ప్రోమో రిలీజ్ చేసింది. దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక అంటూ వచ్చిన ఈ పాట బీట్ బన్నీ అభిమానులను అలరిస్తుంది. తాజా ప్రోమోలో బన్నీ నోటితో పెద్ద కత్తి పట్టుకొని సీరియస్ లుక్‏లో కనిపిస్తున్నాడు. అలాగే ఇందులోని లేడీ డ్యాన్సర్స్ ఎక్స్‏ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సాంగ్ ప్రోమోతో అల్లు అర్జున్ ఈ సినిమాలో ఏ రేంజ్‏లో కనిపించబోతున్నాడో అర్థమవుతుంది. ఇక ఈ పాటకు థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ పునకాలు రావడం ఖాయమన్నట్టుగా తెలుస్తోంది. ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‏గా నటిస్తున్నాడు.

వీడియో..

Also Read: Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మ్యాటరెంటంటే..

Allu Shirish: బుల్లితెరపైకి అల్లువారబ్బాయి.. మిల్కీబ్యూటీతో కలిసి సందడి చేయనున్న హీరో..