Harassment: మొదట స్నేహం అన్నాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నాని వేధించాడు. నో చెప్పేసరికి అసలు రూపం బయట పెట్టాడు.

Facebook Cheating: సోషల్‌ మీడియా విస్తృతి పెరుగుతోన్న క్రమంలోనే దానివల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. సోషల్‌ మీడియాను అడ్డుగా...

Harassment: మొదట స్నేహం అన్నాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నాని వేధించాడు. నో చెప్పేసరికి అసలు రూపం బయట పెట్టాడు.
Cyber Stalker
Follow us
Vijay Saatha

| Edited By: Narender Vaitla

Updated on: Aug 11, 2021 | 7:12 PM

Facebook Harassment: సోషల్‌ మీడియా విస్తృతి పెరుగుతోన్న క్రమంలోనే దానివల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. సోషల్‌ మీడియాను అడ్డుగా పెట్టుకొని మహిళలను బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జంగంపేట ప్రసాద్‌ రెడ్డి అనే యువకుడు ఇంజనీరింగ్‌ చదువుతోన్న ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. శంకర్‌పల్లికి సమీపంలో ఉన్న పిల్లిగుండ్ల గ్రామంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతోన్న ఓ అమ్మాయిని చూసిన ప్రసాద్‌ రెడ్డి, 2019 నుంచి ఆమెను ఫాలో కావడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సదరు అమ్మాయిని కళాశాలకు చెందిన ఓ విద్యార్థి ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్‌ రెడ్డి.. ‘మరోసారి ఆ అమ్మాయి జోలికి వస్తే బాగుండదు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ప్రసాద్‌రెడ్డికి, ఆ అమ్మాయితో స్నేహం కుదిరింది. తనకు సహాయం చేశాడు కదా అని, మంచి స్నేహితుడనే భావనతో ఆమె కూడా ప్రసాద్‌తో సాన్నిహిత్యంగా మెలగడం ప్రారంభించింది. ఈ సమయంలోనే ప్రసాద్‌.. అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫొటోలను సేకరించాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని వేధించడం మొదలు పెట్టాడు. ప్రసాద్‌ చేసిన ప్రపోజ్‌ను ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించి.. అప్పటి నుంచి దూరం పెట్టడం ప్రారంభించింది.

దీంతో పగ పెంచుకున్న ప్రసాద్‌ తాజాగా ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ నుంచి ఆ అమ్మాయికి మెసేజ్‌ చేశాడు. ‘నన్ను ప్రేమించకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని’ బెదిరిస్తూ మెసేజ్‌లు చేశాడు. ఇంతటితో ఆగని ప్రసాద్‌ చేతు కట్‌ చేసుకున్నట్లు ఆ అమ్మాయికి భ్రమ కలిగేలా ఇంటర్‌నెట్‌ నుంచి ఒక ఫొటోను డౌన్‌లోడ్‌ చేసి పంపించాడు. ఇదే ఫొటోను అమ్మాయి వాట్సాప్‌ నెంబర్‌కు కూడా పంపాడు. అంతేకాకుండా.. ‘నన్ను ప్రేమించకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తాను, నీ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను’ అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో వెంటనే అమ్మాయి ప్రసాద్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేసి పోలీసులను ఆశ్రయించి పూర్తి వివరాలను తెలియజేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని రకలా సాంకేతిక ఆధారలను సేకరించి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ప్రసాద్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

Also Read: Nara Lokesh: వాళ్లకి జీతాలివ్వకుండా.. ఆ వేల కోట్ల అప్పులు ఎవ‌రి జేబుల్లో వేశారు.. ఆర్థిక నేరాల్లో ఉన్న అతను పీఏసీ సభ్యుడా?: నారా లోకేష్

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన అప్‌డేట్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం

Hyderabad: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌పై బైక్‌ విన్యాసాలు చేసిన యువకులు.. సీన్‌ కట్‌ చేస్తే.. కాసేపటికే..