Vizag Honeytrap Case: వాట్సప్ కాల్ చేసి మత్తుగా మాట్లాడి ముగ్గులోకి దించుతారు.. సీన్ కట్ చేస్తే …
ఒంటరిగా ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. అంటూ ఊరిస్తారు. మెస్మరైజ్ చేసేలా మెసేజ్ చేస్తారు. నిజమని నమ్మి కాల్ చేశారో ఖేల్ ఖతం. జీవితం తారుమారైపోతుంది. కాల్ మి ఎనీటైమ్ పేరుతో
Honey Trap: ఒంటరిగా ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. అంటూ ఊరిస్తారు. మెస్మరైజ్ చేసేలా మెసేజ్ చేస్తారు. నిజమని నమ్మి కాల్ చేశారో ఖేల్ ఖతం. జీవితం తారుమారైపోతుంది. కాల్ మి ఎనీటైమ్ పేరుతో ట్రాప్ చేస్తున్న భార్యాభర్తలను, వాళ్లకు సహకరిస్తున్న అబ్దుల్ రహీం అనే నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
తియ్యని, రొమాంటిక్ మాటు చెప్పి ముగ్గులో దింపి తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ముగ్గురు మోసగాళ్లు. భార్యభర్తలు జ్యోతి, సతీష్ హైదరాబాద్‌కు చెందినవారు. మగాళ్ళ వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్న ఈ ముఠా.. కాల్ మి ఎనీ టైం పేరుతో మెసేజ్ పంపి ట్రాప్ చ్జేస్తుంటారు. ఇలానే ఒక విశాఖ యువకుడ్ని న్యూడ్ గా కాల్ చేయాలని గాలం వేసింది యువతి.
ఆమె మాటల్లో పడి న్యూడ్ వీడియో కాల్ చేశాడా యువకుడు. వీడియో కాల్ స్క్రీన్ షాట్ తీసి బ్లాక్ మెయిల్ ప్రారంభించింది ఆ మహిళ. ఇలా చేసి ఆ కుర్రాడి దగ్గర్నుంచి దఫదఫాలుగా 24 లక్షలు లాగేసింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురి ఆట కట్టించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడున్నర లక్షల నగదు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు.
Read also: ‘బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి’