‘బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి’
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. అధికారంలోకి వచ్చిన
YSRCP MLA Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. అధికారంలోకి వచ్చిన 26 నెలల కాలంలోనే సీఎం టు కామన్ మ్యాన్ కు డీబీటీ(డైరెక్టు బెనిఫిట్ స్కీం) ద్వారా నేరుగా లబ్ధిదారులకు చేరేలా రూ. లక్ష కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే.. అందులో రూ. 50 వేల కోట్లకు పైగా బీసీల సంక్షేమానికి ఖర్చు చేశారని జోగి చెప్పారు.
నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 19 వేల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ప్రయోజనాలు లభించాయని ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరుసగా మూడో ఏడాది చేనేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాదికి రూ. 24 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని చెప్పుకొచ్చారు.
నేతన్నలకు చంద్రబాబు ఏడాదికి రూ. 50 వేలు ఇచ్చాడని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అది నిజం కాదని జోగి అన్నారు. “రూ. 50 వేలు కాదు కదా.. 50 నయా పైసలు కూడా ఏనాడూ చంద్రబాబు ఇవ్వలేదు” అని ఎమ్మెల్యే జోగి రమేష్ వెల్లడించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో చేనేత, నేత కుటుంబాలు పడుతున్న కష్టాలను అతి దగ్గరగా చూసి, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఏ మాట అయితే చెప్పారో, చెప్పిన మాట చెప్పినట్లు అధికారంలోకి వచ్చాక చేసి చూపించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన అన్నారు.