Secunderabad Military: పంద్రాగస్టు వేళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. సికింద్రాబాద్ ఏరియాలో హై అలర్ట్
Secunderabad Military: స్వాంతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతోన్న వేళ అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు...
Secunderabad Military: స్వాంతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతోన్న వేళ అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ రోడ్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో రక్షణ విషయంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 13 అర్థరాత్రి నుంచి ఆగస్టు 16 ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఈ మూడు రోజుల పాటు సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. ఇందులో భాగంగానే ఈ మూడు రోజుల పాటు అధికారులు భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. ఈక్రమంలోనే సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. మూడు రోజుల పాటు రోడ్లను మూసివేయనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా ఉండడానికి తగిన భద్రత చర్యలు తీసుకోనున్నామని అధికారులు వివరించారు. ఇందుకు స్థానిక పౌరులు తమ మద్ధతును పూర్తిగా అందిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: సభ్య సమాజానికి తలవంపులు.. పోర్నోగ్రఫీ తయారీలో ఈ 15 దేశాలు పెద్ద తోపులు..
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు