AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravanam saare: వాటే సారె.. ‘సరిలేరు మీకెవ్వరూ..!’.. మరోసారి హాట్‌టాపిక్‌గా తోట, బత్తుల వార్ల కావిళ్ళు

సాధారణంగా సారెను వధువు తల్లిదండ్రులు.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పెడుతూ ఉంటారు. పెళ్లి అయిన తొలిరోజుల్లో పసుపు కుంకుమతో కలిపి సారె...

Sravanam saare: వాటే సారె.. 'సరిలేరు మీకెవ్వరూ..!'.. మరోసారి హాట్‌టాపిక్‌గా తోట, బత్తుల వార్ల  కావిళ్ళు
Thota Vari Kavillu
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2021 | 5:47 PM

Share

సాధారణంగా సారెను వధువు తల్లిదండ్రులు.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పెడుతూ ఉంటారు. పెళ్లి అయిన తొలిరోజుల్లో పసుపు కుంకుమతో కలిపి సారె పట్టుకొని వధువు అత్తింటిలో అడుగుపెడుతుంది. ఆ తర్వాత చంటిబిడ్డతో మరోసారి సారె తీసుకెళ్తుంది. ఈ మధ్యలో ఆషాడం, శ్రావణం సారె కావిళ్లు ఇచ్చిపుచ్చుకోవడం గోదావరి జిల్లాల్లో పరిపాటి. ఈ క్రమంలో గత నెలలో యానంలో అల్లుడింటికి చేరిన మామగారి ఆషాడం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. గత నెలలో ఆషాడ మాసం రావటంతో అల్లుడింటికి మామగారి ఇంటినుండి సారె కావిళ్ళను పంపించారు. ఆ సారెను చూసి అత్తింటివారు అవాక్కయ్యారు. వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లతో వస్తువులను పంపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యానాం వచ్చిన ఈ ఆషాడం కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లి కుమారుడు ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని కావిళ్లు అందర్నీ ఆశ్చర్య పరచడంతో.. బత్తుల, తోట వార్ల కావిళ్ళ గురించి విపరీతంగా చర్చ జరిగింది.

ఇక ఆడపిల్లవారు ఉభయ తెలుగు రాష్ట్రాలు మారుమోగిపోయేలా కావిళ్లు పంపారు. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. ఆశాడ మాసం తరువాత శ్రావణమాసం వచ్చిన సందర్భంగా తమ కుమారుడ్ని.. అత్తవారి ఇంటికి పంపుతూ 5 వాహనాల్లో 10 టన్నుల బరువున్న 20 రకాల స్వీట్లను పంపించారు.

Also Read: సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు

 ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు.. ఆ జిల్లాలో కలవరపెడుతున్న మరణాలు