Hockey Player Rajini: ఒలింపిక్ హాకీ ప్లేయర్ రజినీపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్.. రూ. 25 లక్షలు, ఉద్యోగంతో పాటు..
Hockey Player Rajini Jagan: తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ టీమ్ అద్భుత ఆటతీరును కనబరిచిన విషయం తెలిసిందే. పతకం గెలుచుకోకపోయినప్పటికీ ఈ జట్టు కోట్లాది మంది భారతీయుల...
Hockey Player Rajini Jagan: తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ టీమ్ అద్భుత ఆటతీరును కనబరిచిన విషయం తెలిసిందే. పతకం గెలుచుకోకపోయినప్పటికీ ఈ జట్టు కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. చివరికి ప్రత్యర్థి జట్టు సైతం మన ప్లేయర్స్ ఆటతీరును మెచ్చుకున్నారు. ఇలా ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటిన మహిళా హాకీ ప్లేయర్స్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఇక హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి ఇ. రజనీ కూడా పాల్గొంది. తాజాగా టోక్యో నుంచి స్వగ్రామానికి చేరుకున్న రజనీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా సీఎం రజినీకి అభినందనలు తెలిపి, పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
ఈ సందర్భంగా రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి.. పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటితో పాటు తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రజినీ దేశం గుర్తించే స్థాయికి ఎదిగింది. ఇక రజినీ తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ తో పాటు.. 2016లో రియో ఒలింపిక్స్ లో పాల్గొంది. రజినీ భారత్ తరపున ఇప్పటి వరకు 110 అంతర్జాతీయ హాకీ మ్యాచ్ లలో పాల్గొంది.
Also Read: PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.1 డిపాజిట్ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!