Boy died: హైటెక్ సిటీ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఆడుకుంటూ వెళ్లి రోలింగ్ షెట్టర్‌లో చిక్కుకుని పదేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్‌లో చిక్కుకుని పదేళ్ల బాలుడు ప్రాణాలను కోల్పోయాడు.
Hyderabad Boy died: హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్‌లో చిక్కుకుని పదేళ్ల బాలుడు ప్రాణాలను కోల్పోయాడు. హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలోని ఆంజయ్య నగర్‌లో ఈ ఘటన జరిగింది. రాజేష్ అనే 10ఏళ్ల యువకుడు టీవీఎస్ షోరూం భవనంలో ఉన్న ఆటోమేటిక్ షెట్టర్ లో పడి మృతిచెందాడు. షెట్టర్ పైకి లేపే క్రమంలో ప్రమాదవశాత్తు దానిలో పడి మరణించాడు. రాజేష్..గట్టిగా కేకలు వేయడంతో రాజేష్ తండ్రి వచ్చి బయటకు తీసే లోపే ఆ చిన్నారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలి విచారణ చేపట్టారు.
గచ్చిబౌలిలోని భవనంలో టీవీఎస్ షోరూం వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో షట్టర్ ఆటోమేటిక్ రోలింగ్ బటన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా షట్టర్ చుట్టేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అర్జున్ కాంప్లెక్స్‌లోనే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఎప్పుడు నా కొడుకు షెట్టర్ దగ్గరకు వెళ్లడు.. ఈరోజు ఉదయం కూడా నేను పనికి వెళ్తుంటే నాకు బాయ్ చెప్పాడు.. తర్వాత వెళ్లి షెట్టర్ కింద నలిగిపోయాడంటూ.. తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
Read Also… Cocaine Smuggling: అచ్చం సూర్య సినిమాలానే.. పొట్టలో రూ.10 కోట్ల డ్రగ్స్.. థ్రిల్లింగ్ క్రైం స్టోరీ
డొమెస్టిక్ క్రికెట్‌లో బౌలర్ల ఊచకోత.. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 653 పరుగులు