Cocaine Smuggling: అచ్చం సూర్య సినిమాలానే.. పొట్టలో రూ.10 కోట్ల డ్రగ్స్.. థ్రిల్లింగ్ క్రైం స్టోరీ
Cocaine Capsules - Mumbai airport: మనం సినిమాలల్లో డ్రగ్స్ సరఫరా సన్నివేశాలను చాలాసార్లు చూస్తుంటాం.. ఆ సినిమాల్లో డ్రగ్స్‌ను ప్రణాళికతో ఎవరికి చిక్కకుండా సరఫరా
Cocaine Capsules – Mumbai airport: మనం సినిమాలల్లో డ్రగ్స్ సరఫరా సన్నివేశాలను చాలాసార్లు చూస్తుంటాం.. ఆ సినిమాల్లో డ్రగ్స్‌ను ప్రణాళికతో ఎవరికి చిక్కకుండా సరఫరా చేస్తుంటారు. ఆయా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అచ్చం అలాంటి సీన్ మళ్లీ రిపీటయింది. సూర్య వీడొక్కడే సినిమాలోలాగా.. ఓ వ్యక్తి పొట్టలో డ్రగ్స్ దాచుకొని వచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్ జెడెక్వియాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
కేజీపైనున్న కొకైన్ పదార్థాలను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచుకొని వస్తుండగా.. అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొకైన్‌తో నింపిన 70 క్యాప్సూళ్లను నిందితుడు మింగినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించి.. కొకైన్ క్యాప్సూళ్లను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. నిందితుడు దక్షిణ అమెరికా నుంచి కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదకద్రవ్యాల నిరోధక విభాగం వెల్లడించింది.
Also Read: