AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్న హీరో మహేష్ బాబు.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాలే కాకుండా..

Mahesh Babu: సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్న హీరో మహేష్ బాబు.. ఏమన్నారంటే?
Mahesh
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2021 | 5:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాలే కాకుండా.. మహేష్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తుంటాడు. రెయిన్ బో ఆసుపత్రితో కలిసి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు మహేష్. తాజాగా మహేష్ దంపతులు మరో సేవా కార్యక్రమానికి ముందుడుగు వేసారు. హైదరాబాద్‏లోని శంకర్ పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్ద అనే హెల్త్ కేర్ సెంటర్‏ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mahesh Babu

Mahesh Babu

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం అద్భుతమైన వైద్యమని.. ప్రాచీనమైన సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చికిత్స కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి మాత్రమే కాదని.. మన జీవనశైలిని మార్చడంలోనూ సహాయపడుతుందన్నారు. డాక్టర్ సత్య సింధుజ  నాడీ వైద్యంలో నిపుణురాలు. ఈ వైద్యం ద్వారా ఎలాంటి వ్యాధినైనా నయం చేయవచ్చు. సింధూజ సూచనల ప్రకారం పద్ధతులను పాటిస్తే.. అద్బుతాలు జరుగుతాయని. అలాగే మన జీవిన విధానాన్ని కూడా సరిగ్గా సెట్ చేసుకోవచ్చని తెలిపారు.

Mahesh 1 నొప్పిలేని జీవితాన్ని గడపాలనుకునేవారికి చక్రసిద్ధ వైద్యం ఉత్తమమని డాక్టర్ సత్య సింధుజ అన్నారు. 4000 సంవత్సరాల పురాతనమైన యోగి సైన్స్ సిద్ద హీలింగ్ వైద్యం.. మానవ ఉనికి, భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుందని తెలిపారు.

Also Read: Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..

Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ‘స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ శ్రీనివాస్..