Paagal Pre Release Event: లవ్ యూ చెప్పడం వేరు.. లవ్ చేయడం వేరు అంటున్న ‘పాగల్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన

Paagal Pre Release Event: లవ్ యూ చెప్పడం వేరు.. లవ్ చేయడం వేరు అంటున్న 'పాగల్'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Paagal
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 6:20 PM

విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పాగల్. డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా.. సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా పాగల్ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అందులో కనిపించిన ప్రతి అమ్మాయి వెంట ఐ లవ్ యూ అంటూ చెబుతూ కనిపిస్తుంటాడు హీరో విశ్వక్ సేన్. అలా తను 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను అంటూ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ ఇందులో లవర్ బాయ్‏గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం వేరు.. నచ్చిన అమ్మాయిని లవ్ చేయడం వేరు అంటూ పాగల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో పాగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ వేడుకను సాయంత్రం 6.30 గంటలకు టీవీ9 లో చూడవచ్చు.

పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Also Read: Mahesh Babu: సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్న హీరో మహేష్ బాబు.. ఏమన్నారంటే?

Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..