Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఐకాన్’ మూవీ.. అల్లు అర్జున్‌‌‌కు జోడీగా మరోసారి ఆ భామ..

ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప..

Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న 'ఐకాన్' మూవీ.. అల్లు అర్జున్‌‌‌కు జోడీగా మరోసారి ఆ భామ..
Icon
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 12:54 PM

Allu Arjun: ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌‌‌గా ప్రమోట్ అయ్యాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్‌‌‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పుష్పరాజ్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌‌‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయట. ఈ సినిమాలో బన్నీ లుక్‌ స్టైలిష్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించింది. పుష్ప మాత్రమే కాదు.. ఆ తరువాత కూడా వరుసగా మాస్ డైరెక్టర్లకే ఓటేస్తున్నారు ఐకాన్ స్టార్. వకీల్ సాబ్‌ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్‌ ఐకాన్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవ్వగానే బన్నీ చేయబోయే సినిమా ఇదే. ఆ తరువాత పుష్ప సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మడే  అంటూ ఓ వార్త వినిపిస్తోంది. ఐకాన్ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌‌‌‌గా నటించబోతోందని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరు కలిసి డీజే, అలవైకుంఠపురంలో నటించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది కానీ ఆతర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ జంట ముచ్చటగా మూడోసారి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు