Tejaswi Madivada: వాళ్ళవల్లే మద్యం అలవాటైంది.. అసలు విషయం చెప్పిన తేజస్వి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సినిమాతో ఇండస్ట్రీలోకి అడిగి పెట్టింది తేజస్వి మడివాడ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సినిమాతో ఇండస్ట్రీలోకి అడిగి పెట్టింది తేజస్వి మడివాడ(Tejaswi Madivada). చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ప్రేక్షకుల మనసు దోచేసింది. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఏమాత్రం మొహమాట పడకుండా తన గ్లామర్ తో ఆకట్టుకుంది తేజస్వి. ఇప్పుడు కమిట్మెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు భామలు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది తేజస్వి. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ.
తనకు మద్యానికి బానిసయ్యానని చెప్పి షాక్ ఇచ్చింది ఈ చిన్నది. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ భామ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో ఈ అమ్మడు తన మాటలతో ఆట తీసుతో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. అయితే అదే సమయంలో కౌశల్ ఆర్మీ ఈ అమ్మడిని టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేశారు. అయితే వారివల్ల చాలా ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చింది తేజస్వి. కౌశల్ ఆర్మీ కారణంగా ఏకంగా దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందని అంది. దాని నుంచి బయటపడటానికి మద్యం అలవాటు చేసుకున్నా అని అంది. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాలని డిసైడ్ అయ్యాను. రెండేళ్ళు ఇండియా వదిలి బయట తిరిగా.. మద్యానికి అలవాటు అవ్వడంవల్లే తన లుక్ పాడైపోయింది అని చెప్పుకొచ్చింది తేజస్వి మడివాడ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




