Viral: చురకత్తుల్లాంటి ఈ కళ్లు ఏ హీరోయిన్‌వో చెప్పగలరా..? పక్కాగా బోల్తా పడతారు..
ఈ కళ్లు ఐశ్వర్యారాయ్‌వి అని చాలామంది చూడగానే చెప్పేస్తారు. అలా అనుకుంటే మీరు కూడా పప్పులో కాలేసినట్లే.
Tollywood: హీరోయిన్స్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ స్పాన్.. హీరోయిన్స్‌కు ఉండదు. కొత్త నీరు రాగానే.. పాత నీరు పోతుంది అన్నట్లుగా.. కొత్తగా ఆకట్టుకునే ఫేస్ రాగానే.. మేకర్స్ ఆమె వైపు మొగ్గు చూపుతారు. ఇలా వచ్చి.. అలా వెళ్లిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు టాలీవుడ్‌లో. తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. అందులో స్నేహ ఉల్లాల్ ఒకరు. ఫేస్ కట్స్.. కళ్లు.. స్కిన్ టోన్ అంతా ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)లా ఉండటం.. స్నేహకు ఒకింత ప్లస్ అయ్యింది. మరోవైపు మైనస్ కూడా అయ్యింది. జూనియర్ ఐశ్వర్యరాయ్ అనే పేరు.. ఆమె ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు సంపాదించుకునేందుకు సాయపడింది. కానీ కెరీర్ అంత జోష్‌తో సాగలేదు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత కరెంట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. బాలయ్య సింహా సినిమాలోనూ మెరిసింది. ఆ తర్వాత మరో పెద్ద సినిమాలో యాక్ట్ చేయలేదు. 2013లో యాక్షన్ 3D సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2015 తర్వాత ఏ భాషలోనూ వెండితెరపై కనిపించలేదు. ఆమె అనారోగ్య సమస్యలతోనే ఇండస్ట్రీకి దూరం అయిందని గతంలో సన్నిహితులు తెలిపారు. పైన ఫోటోలో ఉన్న కళ్లు స్నేహ ఉల్లాల్‌వి. చాలామంది పొరపడేది ఎక్కడంటే.. అవి ఐశ్వర్యరాయ్ కళ్లు అని అనుకుంటారు. త్వరలోనే ఈ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చి.. అభిమానుల్ని అలరిస్తుందని ఆశిద్దాం.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.