AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra: రణబీర్ కపూర్ కోసం రానున్న తారక్.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడంటే ?..

ఇప్పటికే చిత్రయూనిట్‏తో కలిసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్లను ప్రారంభించారు జక్కన్న. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ బ్రహ్మాస్త్ర సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నారు.

Brahmastra: రణబీర్ కపూర్ కోసం రానున్న తారక్.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడంటే ?..
Bramhastra
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2022 | 1:45 PM

Share

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మాస్త్ర (Brahmastra). మూడు పార్ట్‏లుగా పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, షారుఖ్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. హాలీవుడ్ మూవీని తలపిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్‏తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్‏తో తెరకెక్కి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను దక్షిణాదిలో డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్‏తో కలిసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్లను ప్రారంభించారు జక్కన్న. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ బ్రహ్మాస్త్ర సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నారు.

సెప్టెంబర్ 2న హైదరాబాద్‏లోని రామోజీ ఫిల్మ్ సిటిలో సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా రణబీర్, అలియా, నాగార్జున, అమితాబ్ సైతం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని తారక్ పాత్రకు సంబంధించిన సీన్స్, బ్రహ్మాస్త్రలోని రణబీర్ పాత్రకు సంబంధించిన సీన్స్ కలిపి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. విశ్వంలోనే అత్యం శక్తివంతమైన అస్త్రం బ్రహ్మాస్త్రం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రానున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అయాన్ తెలిపారు. ఈ సినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు