AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanam Shetty: చంపేస్తానంటూ బిగ్‏బాస్ కంటెస్టెంట్‏కు మెసేజ్‏లు.. పోలీసుల అదుపులో నిందితుడు..

తమిళ బిగ్‏బాస్ కంటెస్టెంట్ నటి సనమ్ శెట్టిని చంపుతానంటూ ఓ ఆగంతుకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. బిగ్‏బాస్ షో ద్వారా అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న

Sanam Shetty: చంపేస్తానంటూ బిగ్‏బాస్ కంటెస్టెంట్‏కు మెసేజ్‏లు.. పోలీసుల అదుపులో నిందితుడు..
Sanam Shetty
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2021 | 7:45 AM

Share

తమిళ బిగ్‏బాస్ కంటెస్టెంట్ నటి సనమ్ శెట్టిని చంపుతానంటూ ఓ ఆగంతుకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. బిగ్‏బాస్ షో ద్వారా అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న సనమ్ శెట్టి.. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆమెకు ఓ ఆగంతుకుడు అదేపనిగా మెసేజ్‏లు పంపుతూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‏స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. “గత కొద్ది నెలలుగా నాకు దారుణమైన మెసేజ్‏లు వస్తున్నాయి. ఇన్‏స్టా, ట్విట్టర్ వచ్చే వాటిని మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా నాతోపాటు.. నా కుటుంబాన్ని కూడా చంపుతానంటూ ఏకంగా నా ఫోన్ నంబరుకు కూడా బెదిరింపు మెసేజ్ పంపించాడు ఓ వ్యక్తి. అతడు నా పర్సనల్ విషయాలు కూడా సేకరించినట్లుగా అనిపించడంతో నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీసుకోకండి. బయటకు చెప్పండి. సాయం తీసుకోండి. ఒకరకంగా అది వేరేవాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుంది” అని చెప్పుకొచ్చింది సనమ్ శెట్టి.

ఇక నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడిని రాయ్ జాన్ పాల్‏గా గుర్తించారు. అయితే అతడు ఏ ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డాడు ? ఇతనితో ఎవరైనా చేయించారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక తనను చంపుతానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే కొద్ది రోజులుగా తనకు ధైర్యం చెప్తూ అండగా నిలబడిన అందరికి కృతజ్ఞతలు తెలిపింది.

ట్వీట్..

Also Read: Revenge: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ తర్వాత అడ్డంగా బుక్కైన యువతి..

TSRTC Bus Pass: గ్రేట్‌వాసులకు అలర్ట్.. బస్సు పాస్ సేవలు నిలిపివేసిన టీఎస్‌ఆర్‌టీసీ.. తిరిగి ఎప్పుడంటే..?

Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో… కీలక పాత్రలో..