Viral News: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ తర్వాత అడ్డంగా బుక్కైన యువతి..

Woman Revenge on Ex Lover: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. అంతాబాగానే ఉంది. కానీ ప్రియుడు విడిపోవడాన్ని ఆ యువతి మాత్రం జీర్ణించుకోలేకపోయింది. మాజీ ప్రియుడిపై..

Viral News: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ తర్వాత అడ్డంగా బుక్కైన యువతి..
Traffic Red Light
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 10, 2021 | 8:08 AM

Woman Revenge on Ex Lover: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. అంతాబాగానే ఉంది. కానీ ప్రియుడు విడిపోవడాన్ని ఆ యువతి మాత్రం జీర్ణించుకోలేకపోయింది. మాజీ ప్రియుడిపై పగ, ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్‌లు రచించింది. దీనికోసం ఆమె సరికొత్త ప్లాన్‌ను ఎంచుకుంది. మాజీ ప్రియుడు కారు తీసుకొని.. భారీ జరిమానాలు కట్టేలా.. అతన్ని జైలు పాలు చేసేలా చేసింది. ఈ మేరకు ఏకంగా 49 సార్లు రెడ్ లైట్‌ను క్రాస్ చేసింది. కానీ.. ఈ వ్యవహారం కాస్త బయటపడటంతో.. చివరకు ఆమె కటకటాలపాలయ్యింది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని షాక్సింగ్‌లో చోటుచేసుకుంది.

వివరాలు.. లావ్, కియాన్ కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. ఈ క్రమంలో లావ్ మాజీ ప్రియుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక రచించింది. ఇందుకోసం లావ్ మాజీ ప్రియుడికి తెలియకుండానే.. అతని స్నేహితుడి ద్వారా కారుని అద్దెకు తీసుకుంది. ఆ కారుతో రోడ్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి.. అలా 2 రోజుల్లో 50 సార్లు ట్రాఫిక్‌ రూల్స్‌‌ను ఉల్లంఘించింది. ఇలా చేస్తే మాజీ ప్రియుడికి ఫైన్లతోపాటు జైలుకు వెళ్తాడని అనుకుంది.

ఈ క్రమంలో కేవలం రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కియాన్ ను సంప్రదించగా.. అతను స్నేహితుడి తీసుకెళ్లాడని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు అతని స్నేహితుడిని పిలిచి మాట్లాడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టగా జరిగినదంతా చెప్పింది.

ఈ తరహా ఉల్లంఘన వింతగా ఉండడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అయితే.. నెటిజన్లు మాత్రం.. యువతి ప్లాన్‌ వేసినా.. చివర్లో బొక్కబోర్లా పడిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: జూ నుంచి తప్పించుకొని షాపింగ్ మాల్‌లో ప్రత్యేక్షమైన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో..

Shocking Video: భయంతో పరుగులు తీసిన పులి.. చుక్కలు చూపించిన ఎలుగుబంటి…