TSRTC Bus Pass: గ్రేట్‌వాసులకు అలర్ట్.. బస్సు పాస్ సేవలు నిలిపివేసిన టీఎస్‌ఆర్‌టీసీ.. తిరిగి ఎప్పుడంటే..?

తెలంగాణలో మీసేవ సహా రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రభుత్వ ఆన్‌లైన్ ఆధారిత సేవలన్నీ.. రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి

TSRTC Bus Pass: గ్రేట్‌వాసులకు అలర్ట్.. బస్సు పాస్ సేవలు నిలిపివేసిన టీఎస్‌ఆర్‌టీసీ.. తిరిగి ఎప్పుడంటే..?
Bus Pass Counter
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 10, 2021 | 7:08 AM

Government websites will Inactive: తెలంగాణలో మీసేవ సహా రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రభుత్వ ఆన్‌లైన్ ఆధారిత సేవలన్నీ.. రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ వెబ్​సైట్లూ అందుబాటులో ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రాష్ట్ర డేటా కేంద్రానికి కొత్త యూపీఎస్​అమరుస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 9 (శుక్రవారం ) రాత్రి పది గంటల నుంచి 11వ తేదీ వరకు వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం కలగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్ పాస్ సేవలు కూడా నిలిపిపోనుననట్లు టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో సర్వర్ల నిర్వహణలో భాగంగా అన్ని రకాల ఆన్‌లైన్‌ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సు పాసుల జారీ ప్రక్రియ 9, 11 తేదీలలో నిలిపివేస్తూ ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 11న బస్సు పాసుల జారీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే, సివిల్‌ సప్లయ్‌ శాఖలోని ఇ పాస్‌ సేవలు కూడా ఈ నెల 10న నిలిపివేస్తున్నట్లు జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బాల మాయాదేవి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 11 నుంచి యథావిధిగా ఈ పాస్‌ సేవలు ప్రారంభిస్తామన్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌరులకు ఆన్‌లైన్‌ ద్వారా అందే సేవలకు.. రెండు రోజులపాటు అంతరాయం కలగనుంది.

ఇదిలావుంటే, హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎస్​ఐఐసీలో (TSIIC) 2010లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్‌ డేటా సెంటర్‌.. 2011లో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ వివిధ అప్లికేషన్లను అక్కడ నుంచే నడుపుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూపీఎస్​ ఏర్పాటు చేసి చాలాకాలం అయింది. ప్రస్తుతమున్న పవర్ బ్యాకప్​మెకానిజం ధీర్ఘకాలంతో తట్టుకొనే పరిస్థితి లేదు. దీంతో భవిష్యత్​ అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని యూపీఎస్​ ఏర్పాటుచేసేందుకు ఎస్‌డీసీ ఆపరేటర్ ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ చేపడితే స్టేట్​ డాటా సెంటర్ ఆధారంగా పనిచేస్తున్న వెబ్​సైట్లు, ఆన్​లైన్​ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ నెల 10న రెండో శనివారం, 11 ఆదివారం.. రెండు రోజుల వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనుమతించింది.

Read Also…  హైదరాబాద్‌ పాతబస్తీ స్మశానవాటికలో దొంగలు పడ్డారు… ఏకంగా గుంతను తవ్వి శవాన్నే ఎత్తుకెళ్లారు..!