Sushant Singh Rajput : సుశాంత్ ఆత్మహత్య కేసు.. నిర్దోషిగా హీరోయిన్ రియా.. మళ్లీ సినిమాల్లో నటించనుందా.. ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ముగిసింది. గత కొన్నాళ్లుగా యావత్ దేశ ప్రజలకు ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇస్తూ సుశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని నివేదికలో వెల్లడించింది సీబీఐ. దీంతో ఈ కేసులో దోషిగా ఉన్న హీరోయిన్ రియాకు భారీ ఊరట లభించింది. అయితే ఇప్పుడు రియా తిరిగి సినిమాల్లో నటిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న ఓ యంగ్ హీరో ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. గత కొన్నేళ్లుగా అతడి మృతిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎట్టకేలకు దర్యాప్తు పూర్తి చేసి, క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును గత నాలుగు సంవత్సరాలుగా దర్యాప్తు చేసిన సీబీఐ.. తుది నివేదికను కోర్టులో ప్రవేశపెట్టింది. ఆత్మహత్య కాదు.. హత్య అనడానికి సంబంధించిన ఆధారాలు ఏవి లభించలేదని వెల్లడించింది.
సుశాంత్ మరణం తరువాత, ముంబై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. నివేదిక ప్రకారం అతడి ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని.. సుశాంత్ కొంతకాలంగా నిరాశతో ఉన్నాడని, అతని మరణానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కానీ అతడి నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన కొన్ని వారాలలోనే అతడి ప్రేయసి రియా చక్రవర్తి పై ఆరోపణలు వచ్చాయి. బీహార్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సుశాంత్ ను రియా పూర్తిగా డ్రగ్స్ బానిసగా మార్చేసి బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు. దీంతో ఈ విషయంపై బీహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం చెలరేగింది.
బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం వెంటనే దానిని అంగీకరించింది. ఆగస్టు 19, 2020న సుప్రీంకోర్టు సీబీఐకి పూర్తి అధికారాలు ఇచ్చి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.సీబీఐ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు 2025లో తన ముగింపు నివేదికను సమర్పించింది. అయితే ఈ కేసులో రియా చక్రవర్తి నిర్దోషిగా బయటపడింది. గత నాలుగేళ్లుగా దర్యాప్తులు, కోర్టు చర్యలతో ఇబ్బందిపడిన రియా.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె సినిమాల్లో తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..