AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు.. సీన్ కట్ చేస్తే.!

కూతురు ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వద్దని చెప్పినా వినలేదు. అతనితో ఉంటానని చెప్పింది కూతురు. తమ పరువు సమస్యగా భావించి.. కూతురును ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు పేరెంట్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు.. సీన్ కట్ చేస్తే.!
Victim Photo
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 26, 2025 | 12:16 PM

Share

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని శివరాంపల్లి గ్రామంలో నవంబర్ 14న ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన(16) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు తండ్రి రెడ్డి రాజు తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదు చేశాడు. అయితే ఈ ఆత్మహత్యపై పోలీసులుకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచారణ జరపగా.. పేరెంట్స్ హత్య చేసినట్టు తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు రెడ్డి అర్చనకు అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు కూతురిని తన వైఖరి మార్చుకోవాలని కోరారు. కానీ ఆమె వినలేదు. ఈ క్రమంలో కుటుంబం పరువు పోతుందని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అర్చన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతురాలు తండ్రి రాజు, తల్లి లావణ్య ఇంట్లో ఉన్న పురుగుల మందును బలవంతంగా తాగించారు. తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులను నమ్మించారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఇలానే ఫిర్యాదు చేశారు. తప్పుడు కంప్లయింట్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచారణ చేశారు. తర్వాత నిందితులు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో అర్చన తల్లిదండ్రులపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో