Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput case: ఆ స్టార్‌ హీరో మృతి కేసులో మరో ట్విస్ట్‌.. ఆ హీరోయిన్‌కు మొదలైన కష్టాలు.. NCB కేసు ఫైల్‌

ఈ కేసులో ముందు నుంచీ పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. తాజాగా ఆమెపై..

Sushant Singh Rajput case: ఆ స్టార్‌ హీరో మృతి కేసులో మరో ట్విస్ట్‌.. ఆ హీరోయిన్‌కు మొదలైన కష్టాలు.. NCB కేసు ఫైల్‌
Sushanth Singh Rajput
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 11:24 AM

Sushant Singh Rajput case:  సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందు నుంచీ పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. తాజాగా ఆమెపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు డ్రాఫ్ట్ ఛార్జ్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు సెక్షన్ల కింద ఎన్సీబీ అధికారులు ఆమెపై కేసులు నమోదు చేశారు.

నటుడు సుశాంత్ సింగ్ తన స్నేహితురాలు రియా చక్రవర్తి, అతని స్నేహితులు డ్రగ్స్‌కు బానిసయ్యారని ఎన్‌సిబి తెలిపింది. సుశాంత్ మృతికి సంబంధించిన కేసులో కోర్టుకు సమర్పించిన అదనపు చార్జ్ షీట్‌లో ఎన్‌సీబీ ఈ విషయాలను స్పష్టం చేసింది. నిందితులు 2020 మార్చి నుంచి డిసెంబర్ వరకు కుట్ర పన్నారు. పెద్ద మొత్తంలో మత్తు మందు కొని వాడినట్లు ఎన్‌సీబీ గుర్తించింది. సుశాంత్ ఖాతాలోని డబ్బును లావాదేవీలకు వినియోగించినట్లు అదనపు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎన్‌డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్లు విధించారు. ఈ కేసులో 35 మంది నిందితులుగా చేర్చింది ఎన్‌సీబీ.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జ్ షీట్ ప్రకారం, నిందితులు డ్రగ్స్ కొనుగోలు, ఉపయోగించడం కోసం ఒకరితో ఒకరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ 2018 నుంచి డ్రగ్స్ వాడుతున్నాడని కోర్టులో దాఖలు చేసిన అదనపు చార్జ్ షీట్ లో పేర్కొంది. సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితాని, ఇతర నిందితులు నటుడిని డ్రగ్స్‌కు అలవాటు చేశారని ఛార్జ్ షీట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రియా చక్రవర్తి, సోదరుడు షోక్, సుశాంత్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు నటుడి కోసం డ్రగ్స్ కొన్నారని ఆరోపణలు వచ్చాయి. NCB ప్రకారం, 2018 నుండి, సుశాంత్ తన ఉద్యోగులతో సహా వివిధ వ్యక్తుల ద్వారా క్రమం తప్పకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఎన్‌బిసి ఛార్జ్ షీట్ ప్రకారం వారు “పూజా సామాగ్రి పేరుతో డ్రగ్స్ కొనుగోలు చేశారని ధృవీకరించింది. సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇచ్చిన కేసులో రియా చక్రవర్తిపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే, రియా చక్రవర్తికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ విషయాలను నటి ఖండించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి