AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారి స్నేహం.. పిల్ల ఏనుగు, జీబ్రా పిల్లల దోస్తీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

అడవిలో జంతువులు కొట్లాడుకునే దృశ్యాలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ఆకలిని తీర్చుకోవడానికి అవి ఒకదానిని మరొకటి.. బలిపశువుగా మారే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ..

Viral Video:  చిన్నారి స్నేహం.. పిల్ల ఏనుగు, జీబ్రా పిల్లల దోస్తీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Elephant Vs Zebra
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2022 | 9:30 AM

Share

Viral Video: ఇంటర్నెట్ లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్ కు గురి చేస్తాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాములు, పులులు, సింహాలు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే, అడవిలో జంతువులు కొట్లాడుకునే దృశ్యాలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ఆకలిని తీర్చుకోవడానికి అవి ఒకదానిని మరొకటి.. బలిపశువుగా మారే వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే చూస్తుంటాం..అయితే, తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో రెండు విభిన్న జాతి జంతువుల మధ్య స్నేహబంధానికి సంబంధించినది. ఒక పిల్ల ఏనుగు, జీబ్రా పిల్ల మధ్య స్నేహాన్ని పంచుకునే వీడియో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది.

వీడియోలో పిల్ల ఏనుగు , జీబ్రా పిల్ల మధ్య స్నేహం చూడ ముచ్చటగా ఉంది. పిల్ల ఏనుగు ఆ జీబ్రా పిల్లను తన తొండంతో ముద్దు చేస్తోంది. ఇద్దరు స్నేహితులు ఒకరి భుజంపై ఒకరు చేయివేసుకున్నట్టుగా ఆ ఏనుగు పిల్ల జీబ్రామేడ మీద తన తొండంతో నిమురుతోంది. ఒకదాన్ని ఒకటి ఆలింగనం చేసుకున్నట్టుగా ఆ రెండు పరస్పరం మూగభాషలో తమ స్నేహాన్ని పంచుకుంటున్నాయి. ఈ అందమైన వీడియో ఇంటర్‌నెట్‌ వేదికగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ మంచి స్నేహాన్ని పంచుకోవడం వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కేవలం 31 సెకన్ల నిడివి గల ఈ వీడియోను యోగ్ అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. క్యూట్‌ వీడియోని లక్షల మంది వీక్షించారు. లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి