AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆయా రాశుల వారికి శుభవార్త..! మిగతా వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై

Horoscope Today: ఆయా రాశుల వారికి శుభవార్త..! మిగతా వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2022 | 7:28 AM

Share

Horoscope Today (14-07-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 14న ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జులై 14 గురువారం 2022 సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : ఆషాడ మాసం ఋతువు : గ్రీష్మఋతువు వారము : గురువారం పక్షం : కృష్ణ పక్షం తిథి : పౌర్ణమి మధ్యాహ్నం 12.07ని.ల పాడ్యమి 8.16ని. ల నక్షత్రం : ఉత్తరషాఢ ఉదయం 8.18ని.ల వర్జ్యం : ఉదయం 11.50 ని॥ నుంచి మధ్యాహ్నం 1.15ని॥ వరకు దుర్ముహూర్తం : ఉదయం 10.14ని.ల నుంచి 11.05 మధ్యాహ్నం 3.21ని.ల నుండి 4.12వరకు రాహుకాలం : మధ్యాహ్నం 1.30 ని.ల నుంచి 3.00 ని.ల వరకు యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి ఉదయం 7.18ని.ల వరకు సూర్యోదయం : ఉదయం 5:51 ని.లకు సూర్యాస్తమయం : సాయంత్రం 6:50ని.ల వరకు

మేష రాశి ఫలాలు ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయరాదు. ఇతరులతో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థాలు తొలగిపోతాయి. అదృష్ట సంఖ్య :- 7 అదృష్ట రంగు :- లేత తెలుపు, తెలుపు

వృషభ రాశి ఫలాలు విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. అదృష్ట సంఖ్య :- 6 అదృష్ట రంగు :- పారదర్శక,చంద్రిక

మిథున రాశి ఫలాలు మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. విద్యార్దులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలిపై బాగా ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అదృష్ట సంఖ్య :- 4 అదృష్ట రంగు :- గోధుమ రంగు, బూడిద రంగు

కర్కాటకం రాశి ఫలాలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్ట సంఖ్య :- 8 అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం

సింహం రాశి ఫలాలు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. అదృష్ట సంఖ్య :- 6 అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

కన్య రాశి ఫలాలు ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయ రంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. అదృష్ట సంఖ్య :- 4 అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు

తుల రాశి ఫలాలు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య :- 7 అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు

వృశ్చిక రాశి ఫలాలు పనిలో మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృతగుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. అదృష్ట సంఖ్య :- 9 అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను

ధనుస్సు రాశి ఫలాలు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అదృష్ట సంఖ్య :- 6 అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

మకరం రాశి ఫలాలు చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య :- 6 అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక

కుంభం రాశి ఫలాలు ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు. అదృష్ట సంఖ్య :- 3 అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు

మీనం రాశి ఫలాలు అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి. అదృష్ట సంఖ్య :- 1 అదృష్ట రంగు :- ఆరెంజ్ మరియు బంగారం

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)