Luck By Chance: తండ్రితో గొడవపడి మరీ లాటరీ టిక్కెట్ కొన్న బాలిక.. అదృష్టం కలిసొచ్చి ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే షాకే.!
అమృత్‌సర్‌లో రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కుమార్తె ఇటీవల రూ.100 పెట్టి లాటరీ (lottery) టికెట్ కొనుగోలు చేసింది.
Luck By Chance: అదృష్టం ఉంటే దెబ్బకు జీవితమే మారిపోతుంది. చాలామంది రాత్రికిరాత్రే లక్షధికారులైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో.. అనడానికి ఇదొక ప్రతక్ష్య ఉదాహరణగా నిలిచింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కుమార్తె ఇటీవల రూ.100 పెట్టి లాటరీ (lottery) టికెట్ కొనుగోలు చేసింది. ఏదో అలా కొంటే.. చివరికి ఆమెకు రూ.10 లక్షల విలువైన లాటరీ సొంతమైంది. తమ బిడ్డ రూ.100 టికెట్‌తో రూ.10 లక్షలు గెలుచుకోవడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.
అమృత్‌సర్‌లోని బాబా బకాలా సాహిబ్‌కు చెందిన జమాల్ సింగ్.. తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో అతని కుమార్తె హర్‌సిమ్రన్ కౌర్.. తండ్రికి సాయం చేసేందుకు దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి షాపునకు వచ్చాడు. టికెట్ కేవలం రూ.100 అని, ఒకటి కొనుగోలు చేయండి అంటూ కోరాడు. దీనికి జమాల్ సింగ్ అందుకు నిరాకరించాడు.
ఈ సమయంలో అతని కుమార్తె హర్‌సిమ్రన్ కౌర్.. తన జమాల్ సింగ్ ను ఒప్పించి మరీ కొనుగోలు చేసింది. అయితే.. బుధవారం జరిగిన లాటరీ డ్రాలో ఆ యువతి రూ.10 లక్షలు గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జమాల్ సింగ్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
రూ.10 లక్షలు గెలుచుకున్న సందర్భంగా కౌర్ మాట్లాడుతూ.. తాను ఈ ప్రైజ్ మనీని విద్య కోసం, తన తండ్రికి సహాయం చేసేందుకు ఉపయోగిస్తానని పేర్కొంది. .