Viral News: బ్యాటుతో భర్తను పొట్టుపొట్టుగా కొట్టిన భార్య.. కారణం తెలిస్తే ఫ్యూజులౌటే..! వీడియో
భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి పరుగులు తీశారు. అనంతరం భార్య నుంచి ఆ భర్తను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.
Woman beats husband with a bat: వాళ్లిద్దరికీ పెళ్లై కొన్నేళ్లవుతోంది. భార్యా భర్తలిద్దరూ నిత్యం గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదింది. దీంతో భర్త ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి పరుగులు తీశారు. అనంతరం భార్య నుంచి ఆ భర్తను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం భార్యాభర్తలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగింది. రిద్మల్సర్ గ్రామంలో భార్యాభర్తలు అనీషా, అమీన్ నివాసం ఉంటున్నారు. వారిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. అయితే మంగళవారం రాత్రి 11గంటలకు భార్య అనీషా.. తన భర్త అమీన్‌ను క్రికెట్ బ్యాట్‌తో చితక్కొట్టింది. భార్యాభర్తలిద్దరూ తరుచూ గొడవ పడుతుండడంతో పొరిగింటి వారు అరుపులను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అరుపులు ఆగకపోవడంతో ఏం జరుగుతుందో చూద్దాం పొరుగింటివారు ఆ ఇంటికి వెళ్లారు. భర్తను కొడుతున్న అనీషా నుంచి క్రికెట్ బ్యాట్ లాక్కొని భర్తను కాపాడారు.
వైరల్ వీడియో..
सावधान! ?
बिना खाना खाए सो गया था पति तो पत्नी ने बैट से कर दी धुनाई…वीडियो राजस्थान के बीकानेर का है…. पति को 15 टांके आए हैं. pic.twitter.com/RTP9T3Nq10
— Kumar Abhishek (TV9 Bharatvarsh) (@active_abhi) July 14, 2022
అనంతరం రక్తం కారుతూ తీవ్రంగా గాయపడిన అమీన్‌ను ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స చేసిన వైద్యులు అమిన్ తలకు 17 కుట్లు వేశారు. మరోవైపు అమీన్ కుటుంబ సభ్యులు అతని భార్య అనీషాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అనీషా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగి వచ్చి తనను కొడుతున్నాడని, గృహ హింసకు పాల్పడుతున్నాడంటూ అనిషా పేర్కొంది. అందుకే కొట్టినట్లు పోలీసులకు తెలిపింది. ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భర్త కోలుకున్న తర్వాత అతని స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..