AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Actress: తెలుగులో అక్క.. తమిళంలో చెల్లి.. చెరో ఇండస్ట్రీని పంచుకున్న బాలీవుడ్ భామలు

తన పేరు చెప్పేకంటే.. మారుపేరు చెబుతూనే గుర్తుకు వచ్చే హీరోయిన్లలో ప్రధమ స్థానంలో ఉంటారు శ్రీదేవి. ఆమెను శ్రీదేవి అనేకంటే కూడా అతిలోక సుందరి అనే బిరుదుతోనే చాలా మంది పిలుస్తూ ఉంటారు. బాల్యం తొలినాళ్లలోనే బాల నటిగా సినీరంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి.. తమిళ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దేశం గర్వించదగ్గ నటిగా శ్రీదేవి ఎదిగారు.

Bollywood Actress: తెలుగులో అక్క.. తమిళంలో చెల్లి.. చెరో ఇండస్ట్రీని పంచుకున్న బాలీవుడ్ భామలు
Sridevi's Daughter Khushi Kapoor Get A Film Opportunity In Kollywood
Srikar T
|

Updated on: Nov 19, 2023 | 12:54 PM

Share

తన పేరు చెప్పేకంటే.. మారుపేరు చెబుతూనే గుర్తుకు వచ్చే హీరోయిన్లలో ప్రధమ స్థానంలో ఉంటారు శ్రీదేవి. ఆమెను శ్రీదేవి అనేకంటే కూడా అతిలోక సుందరి అనే బిరుదుతోనే చాలా మంది పిలుస్తూ ఉంటారు. బాల్యం తొలినాళ్లలోనే బాల నటిగా సినీరంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి.. తమిళ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దేశం గర్వించదగ్గ నటిగా శ్రీదేవి ఎదిగారు. ఆ తరువాత బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారిద్దరూ శ్రీదేవికి వారసులుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

పెద్ద కుమార్తె పేరు జాన్వీ కపూర్‌. దఢక్‌ అనే హిందీ చిత్రంలో కథానాయకిగా ఆడుగుపెట్టి వరుసగా చిత్రాలు చేస్తూ తనదైన బెంచ్ మార్క్ ను సెట్ చేస్తున్నారు. బాలివుడ్ లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మన తెలుగు హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దమయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తళుక్కుమని మెరిసి టాలీవుడ్ కుర్రకారుల మదిని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన అక్క బాటలోనే ది ఆర్చీస్‌ అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా ఓటీటీ మధ్యమంలోని నెట్‌ఫిక్స్‌ లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే ఈమె నటించిన తొలి చిత్రం తెరపైకి రాకమునుపే కోలీవుడ్‌లో నటించేందుకు అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. తన హోం గ్రౌండ్లోనే కాకుండా పక్కరాష్ట్రాల్లో కూడా హీరోయిన్ గా అదృష్టం తలుపు తట్టిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

తమిళనాట యంగ్ హీరోగా పేరున్న అధర్వకు జంటగా నటించడానికి ఖుషీ కపూర్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆకాష్‌ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను లైకా నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టింది. ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలోని ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్దమయ్యారు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..