రాక్‌స్టార్ తమ్ముడి కొత్త రూట్.. పూరీతో పనిచేస్తున్న సాగర్
సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు, ప్రముఖ సింగర్ సాగర్ మరో కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు సింగర్‌గా ఎక్కువగా గుర్తింపు

Singer Sagar Puri Jagannadh: సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు, ప్రముఖ సింగర్ సాగర్ మరో కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు సింగర్‌గా ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్న సాగర్, మధ్యమధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ఇక ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ని బయటకు తీస్తున్నారు. రచయితగా తన తండ్రి సత్యమూర్తి వారసత్వాన్ని కొనసాగించేందుకు సాగర్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో రాక్షసుడు మూవీ కోసం డైలాగ్ రైటర్‌గా మారారు. తమిళ రాట్చసన్ రీమేక్‌గా రాక్షసుడు తెరకెక్కినప్పటికీ, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సాగర్ అందించిన డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తోన్న ఫైటర్ సినిమా కోసం సాగర్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు తమిళ డైలాగ్‌లను సాగర్ అందిస్తున్నారు. సోమవారం పూరీ బర్త్‌డే సందర్భంగా అతడికి విష్ చేసిన సాగర్.. హ్యాపీ బర్త్‌డే సర్. మీరు క్రియేట్ చేసే ఎన్నో పాత్రలు మీ సినిమాల్లాగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీరు ఫేక్‌గా ఉండరు లవ్ యు సర్ అని కామెంట్ పెట్టారు. అందుకు స్పందించిన పూరీ.. మనమిద్దరం ఫైటర్ కోసం పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. నీ రైటింగ్ స్కిల్స్‌తో మీ తండ్రిని గర్వపడేలా చేస్తావు అని కితాబిచ్చారు.
Read More:
Breaking: ఏపీలో ‘డ్రీమ్ 11’ బ్యాన్.. డబ్బులపై స్పందించిన యాప్
ఫేమస్ గేమ్‌ని షటౌన్ చేస్తోన్న ఫేస్‌బుక్.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సైతం షాక్
Thanks a lot Sagar ???I m happy we r working together for #fighter .. u will surely make ur dad very proud with ur Tamil dialogues writing skills ..Love u ? ??? https://t.co/fFfRgJEti3
— PURIJAGAN (@purijagan) September 28, 2020