ఓటీటీలో భాగమతి హిందీ రీమేక్.?
Bhaagmathi Hindi Remake: దక్షిణాదిన సూపర్ హిట్ సాధించిన సినిమా ‘కాంచన’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. అవి ఓపెన్ కావడానికి ఆలస్యం అవుతుండటంతో నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ హాట్‌స్టార్ భారీ ధరకు ఈ సినిమా […]

Bhaagmathi Hindi Remake: దక్షిణాదిన సూపర్ హిట్ సాధించిన సినిమా ‘కాంచన’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. అవి ఓపెన్ కావడానికి ఆలస్యం అవుతుండటంతో నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ హాట్‌స్టార్ భారీ ధరకు ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఈ తరుణంలో మరో బడా హిందీ చిత్రం కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
అనుష్క ప్రధాన పాత్రలో తెలుగులో మంచి విజయం సాధించిన ‘భాగమతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. మాతృకను తెరకెక్కించిన అశోక్.. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భూమీ పడ్నేకర్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ ఏడాది చివరికి షూటింగ్ పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు బీ-టౌన్ టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.