AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న అమీబా

అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది.. కరోనా వైరస్‌ ఆ దేశాన్ని గజగజా వణికిస్తోంది.. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు అక్కడే ఉన్నాయి.. మరణాలు కూడా ఎక్కువే! ఇప్పుడేమో కొత్తగా మరో సమస్య వచ్చిపడింది..

అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న అమీబా
Balu
|

Updated on: Sep 30, 2020 | 8:44 AM

Share

అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది.. కరోనా వైరస్‌ ఆ దేశాన్ని గజగజా వణికిస్తోంది.. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు అక్కడే ఉన్నాయి.. మరణాలు కూడా ఎక్కువే! ఇప్పుడేమో కొత్తగా మరో సమస్య వచ్చిపడింది.. మెదడును తినేసే ఓ అమీబాను స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో కనిపెట్టారు టెక్సాస్‌ అధికారులు.. ఇది మహా డేంజర్‌! ఇప్పటికే ఈ రూపంలేని బ్యాక్టిరియా కారణంగా ఓ ఆరేళ్ల బాలుడు చనిపోయాడు కూడా! జోసియా మైక్‌ ఇంటైర్‌ అనే ఆ బాలుడు కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు.. ఆ వెంటనే కన్నుమూశాడు.. మైక్‌ ఇంటైర్‌ను పరీక్షించిన డాక్టర్లు అతడి తలలో అరుదైన మెదడును తినేసే అమీబాను గుర్తించారు. జాక్సన్‌ సరస్సులోని నీటిని పరీక్షించిన నిపుణులు అందులో మెదడును తినే అమీబా చేరినట్టు గుర్తించారు. బహుశా మైక్‌ ఇంటైర్‌ ఈ నీటితో ఆడి ఉండవచ్చు.. లేదా తాగి ఉండవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.. ఇలాంటి బ్యాక్టిరియా ఉన్న నీటిని తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళుతుంది.. ఆ తర్వాత మెదడును తినడం మొదలుపెడుతుంది.. టైమ్‌కు చికిత్స అందించకపోతే మరణం తప్పదంటున్నారు వైద్యులు. విపత్తును గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.. ప్రజలెవ్వరూ కుళాయి నీళ్లు తాగకూడదని, ఆ నీటితో వంట కూడా చేయవద్దని హెచ్చరించారు.. ఇవి కాకుండా ఇతర అవసరాలకు నీటిని వాడుకోవాలంటే మాత్రం కాసేపు నల్లాలను ఓపెన్‌ చేసి ఉండాలని చెప్పారు. తప్పదనుకుంటే మాత్రం నీటిని బాగా వేడి చేసిన తర్వాతే తాగాలని సూచించారు. ఇలాంటి అమీబా ఎక్కువగా వెచ్చని సరస్సులు, నదులలో ఉంటుంది.. ఇలాంటి సరస్సులలో ఈత కొడితే అమీబా శరీరంలో చొరపడే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టిరియా కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.. మెదడువాపు వ్యాధి వస్తుంది.. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే.. ఆరంభంలో తలనొప్పి, జ్వరం వస్తాయి. అప్పుడే డాక్టర్లను సంప్రదించాలి.. వాంతులు, సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని వైద్యులు అంటున్నారు..