హేమంత్ పరువు హత్య కేసు లేటెస్ట్ అప్డేట్ !

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్ పరువు‌ హత్య కేసులో మంగళవారం గచ్చిబౌలి పోలీసులు అతని భార్య అవంతితోపాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:53 am, Wed, 30 September 20
హేమంత్ పరువు హత్య కేసు లేటెస్ట్ అప్డేట్ !

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్ పరువు‌ హత్య కేసులో మంగళవారం గచ్చిబౌలి పోలీసులు అతని భార్య అవంతితోపాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గచ్చిబౌలి పీఎస్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలకు సంబంధించి వారు చెప్పిన అన్ని వివరాలను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం అవంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘నా భర్త హత్యకు సంబంధించి పోలీసులకు అన్ని విషయాలు వివరించారు. హేమంత్‌ కిడ్నాప్‌ అయినప్పుడు సేవ్ చెయ్యడానికి పోలీసులు ప్రయత్నించినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు ప్రాణహాని ఉందన్న విషయం పోలీసులకూ తెలుసు. రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది. హేమంత్‌ హత్య కేసులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. అలాగే హేమంత్‌కి సంబంధించిన ఫోన్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులు కోరారు” అని తెలిపారు. కాగా కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని అవంతి, సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ను కోరారు. అందుకు ఆయన అంగీకరించి సానుకూలత వ్యక్తం చేశారని అవంతి వివరించారు.

ఇంటి దగ్గర పోలీసు పికెటింగ్‌..

అనుమానిత వ్యక్తులు నిత్యం తమ రాకపోకలపై రెక్కీ చేస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చందానగర్‌ సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో తారానగర్‌లోని ఆమె ఇంటివద్ద పోలీసుల పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 24 గంటలు పోలీసు పహారా ఉంటుందని సీఐ వెల్లడించారు. లక్ష్మారెడ్డి ఇంటితోపాటు అవంతి ఉంటున్న బిల్డింగ్ వద్ద పికెటింగ్‌ కొనసాగుతుందని తెలిపారు.

అయితే హేమంత్‌ కేసులో అనేక ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. మొదట హేమంత్‌ను హతమార్చేందుకు ఓ గ్యాంగ్‌తో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డి ఒప్పందం చేసుకున్నట్టు విచారణలో వెలుగుచూసింది. అయితే 10 లక్షలకు ఒప్పందం చేసుకుని లక్ష అడ్వాన్స్‌గా తీసుకున్న ఆ గ్యాంగ్‌ .. పత్తా లేకుండా పోవడంతో మరో సుపారీ గ్యాంగ్‌కు డబ్బులను ఇచ్చి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు.

Also Read :

నెల్లూరులో భారీ చోరీ, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులమంటూ

మెగాస్టార్‌ సినిమాలో రమ్యకృష్ణ !