వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్‌.. చిన్న సైజ్‌ తుంపర్లతోనూ కరోనా వ్యాప్తి

గాలి, బయటి వాతావరణంలో ఉండే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్‌.. చిన్న సైజ్‌ తుంపర్లతోనూ కరోనా వ్యాప్తి
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2020 | 10:39 AM

Coronavirus spread news: గాలి, బయటి వాతావరణంలో ఉండే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు చీదడం చేసినప్పుడు లేదా పాటలు పాడటం, అరవడం, మాట్లాడటం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటివి చేసినప్పుడు వివిధ సైజుల్లో వెలువడే తుంపర్లు ఏ సైజ్‌లో ఎంత ప్రభావితం చేస్తాయి..? అన్న అంశాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఈ క్రమంలో చిన్న సైజు తుంపర్లు, సిగరెట్ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే తుంపర్లు కొన్ని గంటల పాటు గాలిలోనే ఉండిపోతాయని వారు చెబుతున్నారు. ఇవి గది మొత్తం వ్యాపించడంతో పాటు వెలుతురు, గాలి తక్కువగా ఉన్న చోట్ల మరింత అధికం అవుతాయని వారు అంటున్నారు. అంతేకాదు ఈ చిన్న సైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అన్నారు. అందుకే వ్యక్తుల మధ్య 6 అడుగుల కంటే ఎక్కువగా భౌతిక దూరం ఉంటే మంచిదని వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకలు లిన్సేమార్ వెల్లడించారు. మీసిల్స్ మాదిరిగా ఇవి వ్యాపిస్తాయని,  ఏరోసొల్స్‌గా పిలవబడే ఈ తుంపర్లు‌ సమీపంలో ఉన్నవారిపై అధిక ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,103 కొత్త కేసులు.. 11 మరణాలు

Bigg Boss 4: కెప్టెన్సీ టాస్క్‌.. అరియానాను బురిడీ కొట్టించిన మాస్టర్‌