ఫేమస్ గేమ్‌ని షటౌన్ చేస్తోన్న ఫేస్‌బుక్.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సైతం షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అందులో ఫార్మ్ విల్లె కూడా ఒకటి

FarmVille Game: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అందులో ఫార్మ్ విల్లె కూడా ఒకటి. 2009లో జింగ అనే సంస్థ ఈ గేమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గేమ్ వచ్చి 11 ఏళ్లు అవుతుండగా.. వచ్చే ఏడాది జనవరి 1న షడౌన్ చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31న తమ ఫ్లాట్‌ఫామ్‌లో ఫార్మ్ విల్లెను తీసేయబోతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
కాగా వ్యవసాయం, దాని సంబంధిత పనులతో ఈ గేమ్ ఉంటుంది. ఈ గేమ్‌ని ఆడుతున్న వారు ఆటలో భాగంగా భూమిని దున్నడం, మొక్కలు నాటడం, వాటిని పెంచడం, పంటలు పండిండటం, చెట్లను పెంచడం వంటి పనులను చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ యూజర్లు ఎక్కువగా ఆడే ఆటల్లో ఇది కూడా ఉంది. అంతేకాదు కొన్ని సంవత్సరాల తరువాత ఈ గేమ్‌కి సీక్వెల్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన జింగ కంపెనీ.. ”అడోబ్ ఫ్లాష్‌లో ఫార్మ్ విల్లెను ఆడే అవకాశం ఉటుంది. అయితే డిసెంబర్ 31 నుంచి అడోబ్ ఫ్లాష్‌పై పనిచేసే గేమ్‌లు బ్రౌజర్, ఫేస్‌బుక్‌లో సపోర్ట్ చేయవు. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది” అని వెల్లడించింది.అలాగే ”థ్యాంక్యు అన్నది చిన్న పదం అవుతుంది. కానీ ఈ గేమ్‌కి వచ్చిన స్పందన మాకు మరిచిపోలేదని. ఈ గేమ్‌లో వ్యవసాయం చేసిన అందరికీ పెద్ద థ్యాంక్యు” అని జింగ టీమ్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించింది.
ఇక ఈ ఏడాది నవంబర్ 17 నుంచి ఈ గేమ్‌కి సంబంధించిన పేమెంట్స్‌ని ఆపేస్తున్నట్లు జింగ స్పష్టం చేసింది. అయితే జింగ కంపెనీకి సంబంధించిన ఫార్మ్ విల్లె 2 ట్రోపిక్ ఎస్కేప్, ఫార్మ్ విల్లె 2 కంట్రీ ఎస్కేప్, ఫార్మ్‌విల్లె 2 గేమ్‌లు మొబైల్, బ్రౌజర్ రెండింటిలో ఆడుకోవచ్చునని తెలిపింది. కాగా జింగ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది గేమర్లు షాక్‌కి గురయ్యారు. అంతేకాదు ఈ నిర్ణయంపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సైతం షాక్‌కు గురవ్వడం విశేషం.
Read More: