AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాడ్స్ యాప్ ముసుగులో మోసం.. గుట్టురట్టు చేసిన చిన్నారి

. తమ నైపుణ్యంతో ప్రపంచాన్ని కాపాడతారు కూడా. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లోని ఒక చిన్న అమ్మాయి నిరూపించింది ఇదే. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాల్‌వేర్ గుర్తించి, కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది.

యాడ్స్ యాప్ ముసుగులో మోసం.. గుట్టురట్టు చేసిన చిన్నారి
Balaraju Goud
|

Updated on: Sep 24, 2020 | 6:00 PM

Share

మహిళలు అన్ని రంగాల్లో అణిముత్యాల్లా నిలుస్తున్నారు. అవకాశంలో సగం ఆకాశంలో సగం అన్నట్లు వేగంగా పురుషుల్లో సమానంగా రాణిస్తున్నారు. వారు ప్రపంచాన్ని సృష్టించడమే కాదు.. తమ నైపుణ్యంతో ప్రపంచాన్ని కాపాడతారు కూడా. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లోని ఒక చిన్న అమ్మాయి నిరూపించింది ఇదే. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాల్‌వేర్ గుర్తించి, కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. దీంతో టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్ల ముప్పు తప్పడం లేదు. పిల్లలను లక్ష్యంగా ఈ యాప్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే 2.4 మిలియన్లకు పైగా వీటి ద్వారా డౌన్‌లోడ్ అయినట్టు పరిశోధకులు గుర్తించారు.

గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఏడు నకిలీ యాప్స్‌ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను అంటే సుమారు రూ.3.7 కోట్లు దోచేశారు. ప్రధానంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటను ప్లే అవుతాయట. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్‌వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ యాప్స్ ద్వారా ఒక్కో యూజర్ ద్వారా దాదాపు 10 డాలర్ల వరకు ఆర్జిస్తున్నాయి. అయితే, టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై ఫిర్యాదు చేసింది. పిల్లలు ఆన్‌లైన్‌లో ఎలా సేఫ్‌గా ఉండాలో తెలిపే అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్‌లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. దీంతో వారు రంగంలోకి మరింత పరిశోధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవి వాల్‌పేపర్, మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ముసుగులో ఉంటాయని, వీటి ద్వారానే యాడ్‌వేర్ స్కామ్‌లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్‌కు సంబంధించిన పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయమని పరిశోధకులు వ్యాఖ్యానించారు. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారట. దీన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్నారికి అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే పరిశోధకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. కాగా, దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియా ముసుగులో వచ్చే ఫేక్ మేసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ