AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Model School Exam 2025: మోడల్‌ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష రెండో సారి వాయిదా పడింది. తొలుత ఏప్రిల్‌ 13న ఈ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల దీనిని ఏప్రిల్‌ 20కి మార్చారు. అయితే ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో ఈ పరీక్ష తేదీని మరోమారు మార్చాలని..

TG Model School Exam 2025: మోడల్‌ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీ ఇదే!
Model Schools Exam Date
Srilakshmi C
|

Updated on: Mar 19, 2025 | 6:45 AM

Share

హైదరాబాద్‌, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 27వ తేదీకి వాయిదా వేసినట్లు మోడల్‌ స్కూళ్ల అడిషనల్ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి మార్చి 17న ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఏప్రిల్‌ 13న ఈ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల దీనిని వాయిదా వేశామని, ఈ పరీక్షను ఏప్రిల్‌ 20కి మార్చామన్నారు. అయితే ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో ఈ పరీక్ష తేదీని మరోమారు మార్చాలని నిర్ణయించామని తెలిపారు. దీంతో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ పరీక్ష తేదీని ఈ మేరకు రెండు సార్లు అధికారులు మార్చడం గమనార్హం. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఇప్పటివరకు 38,643 దరఖాస్తులు అందాయని, మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా మొత్తం 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షపే నిర్వహించనున్నారు.

క్రీడా కోటాలో 96 మందికి టీచర్‌ పోస్టులు.. మరో వారం పది రోజుల్లో పోస్టింగులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కోటా కింద మరో వారం పది రోజుల్లో 96 మందికి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్‌) అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు అందజేసింది. వాస్తవానికి వీరందరికీ గత ఏడాది అక్టోబరులోనే పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. అయితే అనర్హులు ఎంపికయ్యారని కొందరు ఫిర్యాదు చేయడంతో.. దీనిపై శాట్‌ అధికారులు కమిటీలు వేస్తూ వచ్చారు. తాజాగా శాట్ నుంచి ఎంపిక జాబితా రావడంతో దీనికి పరిష్కారం దొరికినట్లైంది. దీంతో మరో వారం పది రోజుల్లోనే వారికి పోస్టులు కేటాయిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ స్కిల్‌టెస్ట్‌ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పుడెప్పుడంటే?

దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నియామక రాత పరీక్ష స్కిల్‌ టెస్ట్‌ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గత ఏడాది జులై నెలలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్‌ 10, 11 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి