17 March 2025
Subhash
టాటా మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన రాబోయే హారియర్ EV ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ కారు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రావచ్చు. ఇంతకుముందు ఈ కారు జనవరి 2025లో జరిగిన ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ.
కానీ అప్పుడు ఇది కేవలం ఎగ్జిబిషన్ మోడల్ మాత్రమే. ఇప్పుడు టాటా ఈ కారును టెస్ట్ ట్రాక్‌లో నడపడం ద్వారా దాని సామర్థ్యాలను ప్రదర్శించింది.
ఈ కారు అద్భుతమైన డిజైన్‌తో రానుంది. దాని లుక్ పెట్రోల్ వెర్షన్‌ని పోలి ఉంటుంది. దీనిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసింది. ఇది పెట్రోల్ వెర్షన్ నుండి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ కారు ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్, LED లైట్లు, ఇవి స్వాగత వీడ్కోలు యానిమేషన్లతో వస్తాయి. ఈ కారు డిజైన్, కొత్త స్టైల్ అల్లాయ్ వీల్స్‌ను ఏర్పాటు చేశారు.
లోపలి భాగంలో టాటా హారియర్ EV లేఅవుట్ పెట్రోల్ వెర్షన్‌ని పోలి ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
ఇందులో 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
భద్రత కోసం దీనికి ఏడు ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరెన్నో ఫీచర్స్.