AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

వివిధ బ్యాంకులు జారీ చేస్తున్న డెబిట్, క్రెడిట్ కార్డులపై కీలకమైన ఆంక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. విదేశాలలో వున్న వారు క్రెడిట్, డెబిట్ కార్డులను...

క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Sep 30, 2020 | 4:16 PM

Crucial restrictions on debit and credit cards: వివిధ బ్యాంకులు జారీ చేస్తున్న డెబిట్, క్రెడిట్ కార్డులపై కీలకమైన ఆంక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. విదేశాలలో వున్న వారు క్రెడిట్, డెబిట్ కార్డులను అక్రమ మార్గాలలో వాడుకుంటూ.. వినియోగదారులకు భారీ నష్టాలను కలిగిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూపొందించిన కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్గదర్శకాలతో క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కలుగుతుందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త మార్గదర్శకాల ఆధారంగా బ్యాంకులు చేసే మార్పులతో అంతర్జాతీయంగా క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు అమల్లోకి వస్తాయి. కార్డు హోల్డర్ ఇష్టం ప్రకారం పేమెంట్స్ జరిగేలా బ్యాంకులు తమ సాఫ్ట్ వేర్‌ను మార్పు చేయాల్సి వుంటుంది. అంటే.. అంతర్జాతీయ వినియోగంపై బ్యాంకు అకౌంట్ హోల్డర్ తన నిర్ణయాన్ని బ్యాంకు వెబ్‌సైట్‌లో ముందుగానే నమోదు చేయాల్సి వుంటుంది. ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది అటోమేటిక్‌గా కాకుండా వినియోగదారున్ని సంప్రదించిన తర్వాతనే అనుమతించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ బ్యాంకుల వెబ్‌సైట్‌లో కేటాయించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.

తాజా ఆదేశాల ప్రకారం క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వినియోగించాలంటే ముందుగానే తెలియజేయాల్సి వుంటుంది. ఈ రకమైన లావాదేవీలను వినియోగదారులు ఓకే అంటేనే ఆ సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే.. అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అనుమతితోపాటు వ్యయ పరిమితిని కూడా కార్డు హోల్డర్ నిర్ణయించుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ మెసేజ్ చేరేలా సాఫ్ట్ వేర్ మారుస్తున్నారు. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ చెల్లింపులను ఓకే చేస్తారు.

వినియోగదారులు బ్యాంకు వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక మేనేజ్ కార్డ్స్ సెక్షన్ ద్వారా తమ కార్డులపై ఇంటర్నేషనల్ లావాదేవీలు కొనసాగించాలా వద్దా అన్నది ఎంచుకోవాల్సి వుంటుంది. డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. దీనికి తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు కూడా వుంటుంది. లావాదేవీల మొత్తాన్ని కూడా ఇక్కడే నిర్దేశించుకోవచ్చు. తగిన విధంగా మార్చుకోనూ వచ్చు.

Also read:  ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు