AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Don 3: ఆ న్యూస్‎తో డాన్ 3పై ట్రోల్స్.. దర్శకుడిపై ఫ్యాన్స్ సీరియస్..

ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్‌తో మాత్రం పెట్టుకోవద్దు. వాళ్లను గెలికితే.. తేనపట్టును రాయితో కొట్టినట్లే. షారుక్ ఫ్యాన్స్ ఇదే చేస్తున్నారిప్పుడు. వరస హిట్లతో గాల్లో తేలిపోతున్న వాళ్లకు.. గుండెల్లో కాలిపోయే న్యూస్ చెప్పాడు ఓ దర్శకుడు. దాంతో మంటలు మామూలుగా రావట్లేదు. నువ్ సినిమా తీయ్ మేం చూసుకుంటాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా స్టోరీ..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 26, 2025 | 4:25 PM

Share
చాలా ఏళ్ళ తర్వాత షారుక్‌తో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు.. ఇదంతా పఠాన్, జవాన్ సినిమాలు తీసుకొచ్చిందే. వరసగా 2023లో రెండుసార్లు 1000 కోట్లు వసూలు చేసి చూపించారు కింగ్ ఖాన్.

1 / 5
అదే ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో డంకీ కాస్త ట్రాక్ తప్పినా.. కమర్షియల్‌గా మాత్రం అది కూడా హిట్టే. బడ్జెట్ తక్కువ కాబట్టి.. భారీ లాభాలే వచ్చాయి దర్శక నిర్మాతలకు.

2 / 5
ఆల్ గుడ్.. అంతా హ్యాపీస్ అనుకుంటున్న సమయంలో ఓ వార్త ఫ్యాన్స్‌ను బాగా డిస్టర్బ్ చేసింది. అదే డాన్ 3 నుంచి షారుక్‌ను తప్పించి.. రణ్‌వీర్ సింగ్‌ను తీసుకోవడం. ఈ వార్తనే షారుక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

3 / 5
అసలు షారుక్ లేకుండా డాన్ ఏంట్రా బాబూ.. మీ పిచ్చి కాకపోతేనూ అంటూ సోషల్ మీడియాలో తిట్ల దండకం షురూ చేసారు. ఇప్పుడు హీరోయిన్ కూడా మారిపోయింది. డాన్‌ పాత్రకు షారుక్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. డాన్ 2 కూడా బాగానే ఆడింది. 

4 / 5
కానీ డాన్ 3 రణ్‌వీర్ సింగ్‌తో తెరకెక్కిస్తున్నారు ఫర్హాన్ అక్తర్. కాంబో కన్ఫర్మ్ అయినందుకే ట్విట్టర్ షేక్ అయింది.. రేపు సినిమా వస్తే పరిస్థితేంటో..? హీరోయిన్‌గా ముందు కియారాను అనుకున్నా.. ఇప్పుడు కృతి సనన్ అంటున్నారు. అయినా వాళ్లన్నారని కాదు కానీ.. షారుక్ లేని డాన్ ఫ్రాంచైజీ చూడటం కాస్త కష్టమే.. ఏమంటారు..?

5 / 5
Follow Us
అయోధ్య ఆలయంలో 5 కోట్ల బంగారు పుస్తకం ఎక్కడ..?

వర్షాకాలంలో మీ ఖరీదైన లెదర్ షూస్ పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు

గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా

చైల్డ్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..!

200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి?

ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా?

జిమ్ అవసరం లేదు.. రోజుకు 30 నిమిషాలు ఈ వర్కౌట్స్ చేస్తే చాలు!

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పెళ్లి.. డాన్సర్ రేణుక జీవితంలో..

పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!