Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు

KCR wants to give befitting reply to AP and Union government too: చాన్నాళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ… అపెక్స్ బోర్డు (కౌన్సిల్) సమక్షంలో జరగబోతోంది. ఇందుకోసం ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు సంసిద్ధమవుతున్నారు. అయితే, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం వినిపిస్తున్న వాదన కరెక్టు కాదని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు… అపెక్స్ బోర్డు (కౌన్సిల్) భేటీకి ప్రత్యేకంగా రెడీ అవుతున్నారు. ఇందుకోసం బుధవారం […]

ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు
Follow us
Rajesh Sharma

|

Updated on: Sep 30, 2020 | 4:18 PM

KCR wants to give befitting reply to AP and Union government too: చాన్నాళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ… అపెక్స్ బోర్డు (కౌన్సిల్) సమక్షంలో జరగబోతోంది. ఇందుకోసం ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు సంసిద్ధమవుతున్నారు. అయితే, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం వినిపిస్తున్న వాదన కరెక్టు కాదని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు… అపెక్స్ బోర్డు (కౌన్సిల్) భేటీకి ప్రత్యేకంగా రెడీ అవుతున్నారు. ఇందుకోసం బుధవారం సమీక్ష జరిపిన కేసీఆర్.. గురువారం నాడు ప్రత్యేకంగా సాగునీటి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం కావాలని నిర్ణయించారు.

గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో జరగనున్న సాగునీటి రంగ సమావేశానికి సాగునీటి నిఫుణులు, అధికారులు, ఇంజనీర్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు పిలుపు వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 6వ తేదీన జరుగుతుందని భావిస్తున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ చేసిన ఫిర్యాదులకు ధీటుగా సమాధానం ఇవ్వాలని, అందుకు తగిన వాదనలను రెడీ చేసుకుని గురువారం నాటి సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.

గతంలోనే అనుమతులు పొందిన ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులుగాను.. వాటికి తిరిగి అనుమతి పొందాలంటూ ఏపీ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ఏ ప్రాజెక్టు అక్రమం కాదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. తమ వాదనను ఆధారాలతోసహా అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిరూపించాలని భావిస్తోంది. ఏపీకి ధీటైన సమాధానం ఇవ్వడంతోపాటు నదీ జలాల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న అంశం ఆధారంగా కేంద్ర మంత్రి షెకావత్‌ను కూడా నిలదీయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి ఆరున్నర సంవత్సరాలు కావస్తున్నా.. నదీ జలాలను పున: పంపిణీ చేయకపోవడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారు.

గతంలోనే ఈ విషయంలో చొరవ చూపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాను లేఖ రాసిన సంగతి గుర్తు చేస్తున్న కేసీఆర్.. ఆ అంశం ఆధారంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు గణాంకాలను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే నదీ జలాలను పున: కేటాయించాలని విభజన చట్టం చెబుతున్నా.. మోదీ సర్కార్ పట్టించుకోలేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కొత్త ట్రైబ్యునళ్ళను ఏర్పాటు చేయడం లేదా పాత ట్రైబ్యునళ్ళ ద్వారా నదీ జలాల పున: కేటాయింపు జరపాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నదీ జలాలను రాబట్టుకునేలా వాదనలను ప్రిపేర్ చేసుకుని మరీ గురువారం నాటి భేటీకి రావాల్సిందిగా సాగునీటి శాఖ అధికారులను, ఇంజనీర్లను, నిఫుణులను, సలహాదారులను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also read:   క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు