AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్ల జోష్!

Stock Market: ట్రంప్‌ సుంకాలపై 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్లు జోష్‌ పెరిగింది. ఆసియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయ. ఆస్ట్రేలియా, కొరియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా షేర్లు పెరిగాయి. టోక్యో ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన వెంటనే జపాన్..

Stock Market: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్ల జోష్!
Subhash Goud
|

Updated on: Apr 10, 2025 | 11:39 AM

Share

అమెరికా అధ్యక్షుడు సుంకాల పెంపు ప్రకటనతో స్టాక్‌ మార్కెట్‌ సైతం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ తీసుకున్న సుంకాల నిర్ణయంపై ఊరట లభించింది. సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో సైతం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న ట్రంప్‌.. ఆ దేశంపై ఏకంగా 125 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో చైనా కూడా అదే విధంగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించింది.

అయితే ట్రంప్‌ సుంకాలపై 90 రోజుల ఊరటతో స్టాక్‌ మార్కెట్లు జోష్‌ పెరిగింది. ఆసియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయ. ఆస్ట్రేలియా, కొరియా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా షేర్లు పెరిగాయి. టోక్యో ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన వెంటనే జపాన్ బెంచ్‌మార్క్ 2,000 పాయింట్లకు పైగా పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాలను చాలా వరకు తగ్గించాలనే నిర్ణయాన్ని పెట్టుబడిదారులు స్వాగతించారు.

గురువారం జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ 225 ఉదయం ట్రేడింగ్‌లో 8.8% పెరిగి 34,510.86కి చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200 5.1% పెరిగి 7,748.00కి చేరుకుంది. దక్షిణ కొరియా కోస్పి 5.2% పెరిగి 2,412.80కి చేరుకుంది. హాంకాంగ్, షాంఘై మార్కెట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. గత ఐదు రోజుల్లో హాంగ్ సెంగ్ సూచిక గణనీయంగా పడిపోయింది. ఇతర ప్రాంతీయ సూచికల మాదిరిగానే తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్‌ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా షేర్లు పెరిగాయి. టోక్యో ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన వెంటనే జపాన్ బెంచ్‌మార్క్ 2,000 పాయింట్లకు పైగా పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాలను చాలా వరకు తగ్గించాలనే నిర్ణయాన్ని పెట్టుబడిదారులు స్వాగతించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి