AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉలిందకొండలో 40.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా..

AP Rains: ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..
Ap Rains
Ravi Kiran
|

Updated on: Apr 10, 2025 | 9:25 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నిన్న నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఒకసారి చూస్తే.. కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీలు, కడప జిల్లా అమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7 డిగ్రీలు, అమరావతిలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులపై ఆ శాఖ అధికారి ధర్మరాజు కీలక విషయాలు వెల్లడించారు. వాతావరణంలోని మార్పులతో పగలు ఎండలు, రాత్రి వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఉత్తర భారత నుంచి దక్షిణ భారతం వైపు పొడి వాతావరణంతో కూడిన ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇక.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
అడవి మధ్యలో అద్భుతం.. ప్రపంచంలోనే ఖరీదైన హోటల్.. ఒక్క రోజుకు..
అడవి మధ్యలో అద్భుతం.. ప్రపంచంలోనే ఖరీదైన హోటల్.. ఒక్క రోజుకు..
చిరంజీవి, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు..
చిరంజీవి, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు..
ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..
ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..
ఆధార్ కార్డులో తండ్రి పేరును మార్చుకోవడం ఎలా..?
ఆధార్ కార్డులో తండ్రి పేరును మార్చుకోవడం ఎలా..?
విడాకుల తర్వాత హార్దిక్ ఇంటికి వచ్చిన మాజీ భార్య నటాషా
విడాకుల తర్వాత హార్దిక్ ఇంటికి వచ్చిన మాజీ భార్య నటాషా
అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే మీ కష్టాలు పరార్
అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే మీ కష్టాలు పరార్
ఆ హీరోకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. వయసులో చాలా చిన్నోడు..
ఆ హీరోకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. వయసులో చాలా చిన్నోడు..
అప్పటికప్పుడు చేసుకొనే ఎండతో పనిలేని ఫ్యాన్ కింద పెట్టే వడియాలు
అప్పటికప్పుడు చేసుకొనే ఎండతో పనిలేని ఫ్యాన్ కింద పెట్టే వడియాలు
ప్రతీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 డిస్కౌంట్.. మీరు పొందొచ్చు
ప్రతీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 డిస్కౌంట్.. మీరు పొందొచ్చు
మీ ఏసీ కూలింగ్ తగ్గిందా? గ్యాస్ లీక్ అవుతుందో లేదో కనిపెట్టండి!
మీ ఏసీ కూలింగ్ తగ్గిందా? గ్యాస్ లీక్ అవుతుందో లేదో కనిపెట్టండి!