Feeling Tired Always: తరచూ అలసిపోతున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి..!
ఈ రోజుల్లో చాలా మందిని అలసట వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, తక్కువ నిద్ర, రోజువారీ జీవన విధానం. అలసటను తగ్గించేందుకు కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి. అలసటకు చెక్ పెట్టే ఆరోగ్యకరమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో అలసట, శరీర బలహీనత, శక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే అలసట అనేది చిన్న సమస్యగా కనిపించినా.. దీని వెనుక ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలు దాగివున్నాయి. అలాంటి సమస్యలను నివారించేందుకు కొన్ని అవసరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో అవసరం.
శరీరానికి ప్రతిరోజూ విశ్రాంతి అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలోని శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. దీని వల్ల మెదడు విశ్రాంతి పొందుతుంది, శరీర వ్యవస్థలు సరిగా పనిచేస్తాయి.
శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ వస్తుంది. ఇది అలసటకు ప్రధాన కారణం. రోజుకి కనీసం 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి తేలికపాటి ద్రవాలను కూడా తీసుకుంటూ ఉండాలి.
మానసిక ఒత్తిడికి శరీరాన్ని అలసిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రోజూ యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీని ద్వారా అలసట కూడా తగ్గుతుంది.
ఆహారంలో ఐరన్, విటమిన్ బీ12, ప్రోటీన్ లు తక్కువగా ఉన్నప్పుడు అలసట వేధిస్తుంది. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, పండ్లు, నట్‌లను రోజూ ఆహారంలో చేర్చాలి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.
వాకింగ్, లైట్ యోగాసనాలు, బ్రిస్క్ వాక్ లేదా సైక్లింగ్ వంటివి రోజూ 30 నిమిషాలు చేస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇవి శక్తిని అందిస్తాయి. అలసటను దూరం చేస్తాయి.
బరువు అధికంగా ఉంటే శరీరం తేలికగా అలసిపోతుంది. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామాన్ని పాటించటం ద్వారా బరువును నియంత్రించాలి.
రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటివి ఎక్కువసేపు నిరంతరంగా చూస్తుంటే కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది మనం మానసికంగా అలసిపోవడానికి కారణమవుతుంది. అందుకే మధ్య మధ్యలో కొన్ని నిమిషాల విరామం తీసుకుంటూ.. కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.
తీవ్రంగా మసాలా ఉండే ఫుడ్, ఎక్కువ మసాలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది శరీరం అలసిపోవడానికి కారణమవుతుంది. ఫ్రెష్ ఆహారం, తేలికపాటి భోజనం తీసుకోవడం మంచిది.
ఈ టిప్స్‌ను పాటిస్తే అలసటను సహజంగా తగ్గించుకోవచ్చు. శరీరానికి శక్తిని అందించడమే కాదు.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.




