AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palash Flower Benefits: అగ్గిపూల సోయగం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మోదుగ పూలు వసంత కాలం రాకను సూచిస్తాయి. వీటిని అగ్ని పూలు అని కూడా అంటారు. మోదుగ పువ్వుల గురించి పల్లెటూర్లలో ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఇవి ప్రకృతి అందాన్ని పెంచడమే కాదు.. ఔషధంగా కూడా పని చేస్తాయి. మోదుగ చెట్టు పువ్వులు, బెరడు, ఆకులు, విత్తనాలు వంటివి మొక్కలోని వివిధ భాగాలను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మ వ్యాధులు, జ్వరం, మూత్ర విసర్జన అవరోధం, సిర్రోసిస్, గర్భధారణ సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపును పెంచుతుంది. దీని ఆకులను ప్లేట్లు, గిన్నెలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. చర్మ సమస్యల నుంచి జీర్ణ సమస్యల వరకు మోదుగ పువ్వు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Apr 10, 2025 | 9:08 AM

Share
ఎర్రని అందమైన పూల గుత్తులతో మోదుగ చెట్టు చూడటానికి ఏంతో అందంగా ఉంటుంది. మోదుగ పువ్వులు చిలక ముక్కు లాగా కొక్కెం లా ఉండి నారింజ రంగులో చూపరులకు కనువిందు చేస్తాయి. మోదుగ పూల పుప్పొడిని వినియోగించి హోలీ రంగులలో కలిపే పదార్ధాన్ని తయారు చేస్తారు. ఈ మోదుగ పూల ఆకులను అనేక పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.

1 / 6
మోదుగా పూలు పరమ శివునికి ఏంతో ప్రీతికరమైనవిగా మన పూర్వీకులు చెప్పుకునేవారు. ఈ చెట్టు బెరడును ఎండబెట్టి దానిని హోమాలలొ ఉపయోగించే వారు. ఈ బెరడును కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన, దుర్గాంధము పోగొట్టవచ్చు. చెట్టు కలపను ప్యాకేజి బాక్సుల తయారీలలో కూడా వినియోగిస్తున్నారు.

2 / 6
మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..ఆయుర్వేదంలో వీటిని అనేక వ్యాధులకు మందుగా ఉపయోగిస్తున్నారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పూలు చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 6
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పువ్వుల మొగ్గలు చాలా మంచిదట. దీని పొడిని వాడితే చాలా వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మోదుగ చెట్టు బెరడు డయేరియాను నివారిస్తుందట. దీని గింజలు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

4 / 6
మోదుగ పువ్వు నిద్ర సమస్యలను దూరం చేస్తుందట. మోదుగ ఆకుల రసం తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మోదుగ పువ్వుల గింజల పొడిని వాడితే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మోదుగ పూలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
మోదుగ పువ్వులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్ల లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేయడానికి మోదుగ చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి అయితే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6