ఈ రాశుల వారికి అండగా గురుడు.. రేపటి నుంచి ఊహించని లాభాలు..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గ్రహం ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. అయితే ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి రేపు( ఏప్రిల్ 10న) మృగశిర నక్షత్రరాశిలోకి వెళ్తుంది. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో చూద్దాం
Updated on: Apr 09, 2025 | 9:05 PM

బృహస్పతి ఏప్రిల్ 10 నుంచి జూన్ 14 వరకు మృగశిర నక్షత్రరాశిలో సంచరిస్తున్నందున, నాలుగు రాశులకు గురు బలం అధికంగా ఉంటుంది. దీంతో వారు ఏ పని చేపట్టినా అందులో విజయం పొందడం ఖాయం. అంతే కాకుండా లక్కు కలిసి వస్తుందంట.

వృషభ రాశి వారికి బృహస్పతి సంచారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం వీరిసొంతం అవుతుంది. ఆనందంగా గడుపుతారు.

మేష రాశి వారికి కూడా బృహస్పతి సంచారం కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరిపోయి, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తంఉది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు.

సింహ రాశి వారికి బృహస్పతి సంచారంతో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. గురువు వీరికి అండగా ఉండటం వలన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



