- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroine Rupa Koduvayur Latest Lehanga Crazy Photos Goes Viral
Roopa Koduvayur: నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి.. ఈ వయ్యారిని చూస్తే ప్రేమలో పడాల్సిందే..
అచ్చ తెలుగమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల రాశి. సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరోవైపు వరుస ఫోటోషూట్లతో కుర్రకారును ఫిదా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ప్రేమలో పడాల్సిందే..
Updated on: Apr 10, 2025 | 10:53 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిలలో రూప కొడువాయూర్ ఒకరు. చూడచక్కని రూపం.. సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారుతుంది.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో 2020లో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసింది ఈ వయ్యారి.

అందం, నటనపరంగా మంచి మార్కులే అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సారంగపాణి జాతకం సినిమాలో నటిస్తుంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది రూప కొడువాయూర్. తాజాగా ఈ అమ్మడు షేర్ లేటేస్ట్ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. నిశీదిలో మెరిసిన ఉషోదయంలా కనిపిస్తుంది.

రూప కొడువాయూర్.. ప్రస్తుతం తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అంతగా ఆఫర్స్ రావడం లేదు. కానీ నెట్టింట మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.




