IRCTC: చేతిలో డబ్బు లేకపోయినా రైలు ప్రయాణం సాధ్యమే.. కొత్త సర్వీస్ లాంచ్ చేసిన ఐఆర్‌సీటీసీ
భారతదేశ ప్రజలకు రైలు ప్రయాణం అంటే ఓ ఎమోషన్. ముఖ్యంగా దూర ప్రాంతాలకు తక్కువ సొమ్ముతో ప్రయాణించే అవకాశాన్ని భారత రైల్వేలు మనకు అందిస్తాయి. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం రైల్వే సేవల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రైలు టిక్కెట్ బుకింగ్ చాలా వరకు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేలు ప్రయాణికుల కోసం కొత్త సర్వీస్‌ను లాంచ్ చేసింది. ఆ సౌకర్యం ఏంటి? అనే వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

భారతీయ రైల్వేలు అత్యంత సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ మార్గంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. మీరు రైలులో ప్రయాణించాలనుకుంటే కానీ సకాలంలో డబ్బును సర్దుబాటు చేసుకోలేకపోతే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికుల సౌలభ్యం కోసం ‘ఈ-పే లేటర్ ‘ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రయాణికులు తక్షణ చెల్లింపు లేకుండానే తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకుని 14 రోజుల్లోపు చెల్లింపును సౌకర్యవంతంగా చేసుకోవచ్చని పేర్కొంది. డిజిటల్ ఇండియాతో పాటు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ సౌకర్యాన్ని అందించడం కోసం ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రయాణీకులు క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీలు అవుతుంది. మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా మీరు భారతీయ రైల్వేలో ప్రయాణించవచ్చు. ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ అనేది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా రైలు టిక్కెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి కార్డు నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే వారి వాలెట్ బ్యాలెన్స్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ చాలా సౌకర్యంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రతిరోజూ 1 లక్షకు పైగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. అలాగే దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణాలు ఇకపై ఈ-పే లేటర్ ఉపయోగించి ఏదైనా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే 14 రోజుల్లోపు చెల్లింపు చేయవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ ద్వారా బుకింగ్ ఇలా
- ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌లోకి లాగిన్ అవ్వాలి.
- మీకు నచ్చిన రైలు, విమానం లేదా టూర్ ప్యాకేజీని ఎంచుకోవాలి.
- అనంతరం పేమెట్ పేజీకి వెళ్లి ‘ఈ-పే లేటర్’ ఎంపికను ఎంచుకోవాలి.
- అంతే మీ బుకింగ్ తక్షణమే పూర్తవుతుంది. అలాగే చెల్లింపు చేయడానికి మీకు 14 రోజుల సమయం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








