AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Plan: ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్స్‌!

Investment Plan: చాలామంది ఆర్థిక స్వేచ్ఛ, సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటారు. కానీ దాన్ని సాధించడానికి, మన జీవితంలో సరైన దశలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఇందులో ఒకరు నెలకు రూ.1000 ఎలా సంపాదించవచ్చో చూద్దాం. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించినా భవిష్యత్తులో 1 కోటి రూపాయలు..

Investment Plan: ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్స్‌!
Subhash Goud
|

Updated on: Apr 26, 2025 | 5:17 PM

Share

మధ్యతరగతి యువత తమ కుటుంబ భారాలన్నింటినీ వదిలించుకుని స్థిరపడటానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే మీరు పొదుపు, పెట్టుబడుల ద్వారా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. కానీ ఆ వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే భవిష్యత్తులో తాము కోరుకున్న మొత్తాన్ని పొందగలమా లేదా అని చాలా మంది అయోమయంలో ఉంటారు. ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినా, అతను రూ.1 కోటి కంటే ఎక్కువ లాభం పొందవచ్చు. కానీ దానికి సరైన ప్రణాళిక, ఓపిక అవసరం అవసమని గుర్తించుకోవాలి. చాలామంది ఆర్థిక స్వేచ్ఛ, సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటారు. కానీ దాన్ని సాధించడానికి, మన జీవితంలో సరైన దశలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఇందులో ఒకరు నెలకు రూ.1000 ఎలా సంపాదించవచ్చో చూద్దాం. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించినా భవిష్యత్తులో 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు.

అది ఎలా సాధ్యం?

మీరు నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అతను 21 సంవత్సరాలు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. వారికి వార్షిక ఆదాయం 12 శాతం. దీని తరువాత 21 సంవత్సరాల ముగింపులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించవచ్చు. 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం చాలా ఆలస్యమనే చెప్పాలి. ఇంకా ముందు నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ చేసుకుంటే మంచి బెనిఫిట్స్‌ పొందవచ్చు. నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే 21 సంవత్సరాలలో లక్ష్యాన్ని సాధించవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ప్రారంభించడం మంచిది.

ఉత్తమ పెట్టుబడి అవకాశాన్ని అందించే ప్రాజెక్టులు:

మీరు వడ్డీ రేట్లను తనిఖీ చేసి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి ఏవైనా పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మొదట మీరు మీ పెట్టుబడి వయస్సు ఆధారంగా సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అది సరైన వయస్సుగా పరిగణిస్తారు. మనం వయసు పెరిగే కొద్దీ నెలకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా 35 సంవత్సరాల వయస్సులో ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలంటే వారు రూ.18,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించడం ముఖ్యం.

(Disclaimer: ఈ వివరాలు ఇంటర్నెట్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా అందిస్తున్నాము. మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండని సూచిస్తున్నాము.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి